NTV Telugu Site icon

BRS: బీఆర్ఎస్ కీలక సమావేశం.. ప్రధాన చర్చ దేని గురించంటే?

Brs

Brs

తెలంగాణ భవన్ లో కేటీఆర్, హరీష్ రావుల ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన రుణమాఫీపై ప్రధానంగా చర్చించారు. రుణమాఫీ కానీ రైతుల విషయంలో భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ఎన్టీవీతో మాట్లాడారు. రైతు రుణమాఫీపై ప్రధానంగా చర్చించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం పూర్తి రుణమాఫీ చేయడంలో విఫలమైందన్నారు. ప్రతి గ్రామానికి తిరిగి రుణమాఫీ కాని రైతులను కలుస్తామని చెప్పారు. ఇదే కాకుండా పూర్తి రుణమాఫీ చేసే వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామన్నారు. ప్రభుత్వం దిగొచ్చేదాకా.. నిరసనలు వ్యక్తం చేస్తామన్నారు.

READ MORE: Lucknow: లక్నో ఎయిర్‌పోర్టులో రేడియోధార్మిక పదార్థం లీక్.. ఖాళీ చేయించిన అధికారులు

కాగా.. రుణమాఫీ అంశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల నినాదాలతో నిన్న (శుక్రవారం) అర్ధరాత్రి సిద్దిపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రభుత్వం రుణమాఫీ చేసిందని..హామీ మేరకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు రాజీనామా చేయాలంటూ పట్టణంలో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ నేతలతో వాగ్వాదానికి దిగారు. అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి బీఆర్‌ఎస్‌ నాయకులను అక్కడి నుంచి పంపించారు. ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు హరీశ్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి చేసి అక్కడున్న ఫ్లెక్సీల చింపివేశారు. ఈ ఘటనపై సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఫ్లెక్సీల చింపివేతపై హరీష్ రావు ట్వీట్ చేశారు. మాజీ మంత్రిపైనే దాడి చేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.