Bandi Sanjay: తెలంగాణ గవర్నర్ తమిళిసై పై మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. నిజాయితీగా ఉండే గవర్నర్ అధికార బీఆర్ఎస్ కు నచ్చటం లేదని ఆరోపించారు. గవర్నర్ ను హేళనకు గురిచేయడం రాజ్యాంగాన్ని అవమానించటమేనని బండి సంజయ్ అన్నారు.
Read Also: Manipur: ఆర్మీపైకి కాల్పులు జరిపిన నిరసనకారులు.. ఉద్రిక్తంగా మణిపూర్..
బీఆర్ఎస్ చేస్తున్న అవినీతిని గవర్నర్ చూస్తూ ఊరుకోవాలా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రగతి భవన్ తాగి తినడానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నారని.. సీఎం ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు కాబట్టే.. వారు రాజ్ భవన్ వైపు చూస్తున్నారని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రా..? మహారాష్ట్రకు ముఖ్యమంత్రా అని ఆయన ప్రశ్నించారు. మరోవైపు హైద్రాబాద్ ఉస్మానియా ఆసుపత్రి విషయమై వాగ్ధానాన్ని నెరవేర్చాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ట్విట్టర్ వేదికగా నిన్న స్పందించారు. అయితే గవర్నర్ వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు.
Read Also: Hari Hara Veeramallu : ఇకనైనా ఈ సినిమాకి మోక్షం కలిగేనా…?
బీజేపీ అధికార ప్రతినిధిలా గవర్నర్ తమిళిసై మాట్లాడుతున్నారని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ వైద్య శాఖలో అభివృద్ధి.. గవర్నర్ కు కన్పించడం లేదా అని ప్రశ్నించారు. చెడు మాత్రమే గవర్నర్ బూతద్దంలో చూస్తున్నారన్నారు. ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని కూల్చివేసి కొత్త భవనం నిర్మాణానికి కేసీఆర్ ప్లాన్ చేశారన్నారు. కానీ కొందరు కోర్టుకు వెళ్లడంతో కొత్త భవనం నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదని హరీష్ రావు గుర్తు చేశారు.