పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తున్నారు.వచ్చే నెలలోఆయన నటించిన బ్రో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ తరువాత ఓజి సినిమా కూడా దాదాపు షూటింగ్ పూర్తి కావస్తుంది.. ఇదే ఏడాది లో ఓజీ సినిమా విడుదల అవ్వబోతున్నట్లు సమాచారం..పవన్ ఎప్పుడో మొదలు పెట్టి సగానికి పైగా షూట్ పూర్తి చేసిన హరి హర వీరమల్లు సినిమా తో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల పరిస్థితి ఏంటో అస్సలు అర్థం కావడం లేదు. హీరోగా పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమా కు కేవలం రెండు నెలల సమయం మాత్రమే కేటాయిస్తున్నట్లు సమాచారం. హరి హర వీరమల్లు సినిమా కు మాత్రం ఎక్కువ సమయం పట్టేలా ఉంది.. అందుకే మొదట తక్కువ డేట్స్ వున్న సినిమాలను ముగించాలని పవన్ భావిస్తున్నట్లు సమాచారం.. డేట్స్ ఎక్కువ ఇవ్వాలనే ఉద్దేశంతో హరి హర వీరమల్లు సినిమా ను ప్రస్తుతానికి పక్కకు పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వచ్చే సంవత్సరం ఎన్నికలు పూర్తి అయిన తర్వాత విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయనీ తెలుస్తుంది..
అలాగే హరి హర వీరమల్లు సినిమా కూడా వచ్చే సంవత్సరం విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.అయితే హరి హర వీరమల్లు సినిమా ఎన్నికలకు ముందు వస్తుందా లేదా ఎన్నికలు పూర్తి అయినాక వస్తుందా అనే విషయం పై మాత్రం క్లారిటీ అయితే లేదు.. పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమా ను రూపొందిస్తున్న క్రిష్ ఎంతో కాలంగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన ఈ సినిమా గ్యాప్ లో మూడు నుంచి నాలుగు సినిమాలు అయితే తీసేవాడు. కానీ ఇప్పటి వరకు పవన్ సినిమాతోనే పూర్తిగా లాక్ అయిపోయాడు.. హరి హర వీరమల్లు సినిమా గురించి పవన్ ఆలోచించకపోవడంతో అటు దర్శకుడు క్రిష్, అలాగే హీరోయిన్ నిధిఅగర్వాల్ సంధిగ్దంలో పడినట్లు సమాచారం..మరీ పవన్ ఈ సినిమాను పూర్తి చేస్తాడా లేదా అనేది చూడాలి.