NTV Telugu Site icon

KCR: త్వరలో ఢిల్లీకి బీఆర్ఎస్ అధినేత.. ఓటమి తర్వాత తొలిసారి

Kcr

Kcr

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ వారంలోనే ఆయన హస్తిన టూర్ ఉంటుందని చెబుతున్నారు పార్టీ శ్రేణులు. కాగా.. ఎన్నికల తర్వాత మొదటిసారి ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయన మూడు నెలల సమయం తర్వాత ఢిల్లీకి వెళ్తున్నారు. ఎన్నికలు జరిగిన తర్వాత కేసీఆర్ జారిపడటంతో తుంటి విరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకున్న కేసీఆర్.. ఇప్పుడిప్పుడే కోలుకుని నడవగలుగుతున్నారు. అంతేకాకుండా.. మొన్న నల్గొండలో జరిగిన బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీల మధ్య పొత్తు ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే ఈ సమయంలో ఢిల్లీ వెళ్తున్న దానిపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఢిల్లీలో కేసీఆర్.. ఎవరిని కలుస్తున్నారన్న దానిపై చర్చ జరుగుతుంది. ఢిల్లీలో కేసీఆర్ ఎవరితో భేటీ అవుతారన్న దానిపై స్పష్టత రాలేదు. ఏ ఎజెండా మీద ఢిల్లీకి వెళ్తున్నారన్నది తెలియాల్సి ఉంది. అయితే కేసీఆర్ పర్యటనకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో క్లారిటే వచ్చే అవకాం ఉంది.

YSR Kalyanamasthu and YSR Shaadi Tohfa: గుడ్‌న్యూస్‌.. రేపే వారి ఖాతాల్లో సొమ్ము జమ

మరోవైపు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటపెట్టే పనిలో మునిగిపోయింది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టింది. ఇటీవలే అసెంబ్లీలో ప్రాజెక్టులపై శ్వేతపత్రం కూడా విడుదల చేసి.. కేసీఆర్ వైఫల్యాలను ఎండగట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో భాగస్వామ్యమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదంటూ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఒంటరిగా పోటీ చేసి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ని ఓడించడం కష్టమనే అభిప్రాయానికి వచ్చారు కేసీఆర్. ఈ క్రమంలో.. బీఆర్ఎస్ బలానికి బీజేపీ క్యాడర్ కూడా తోడు అయితే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించవచ్చనే ఆలోచనతో ఉన్నారు కేసీఆర్.

ఈ నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పొత్తు కోసం ఢిల్లీ వెళ్తున్నారా.. లేదంటే కాళేశ్వరం ప్రాజెక్టులో తమను తప్పించమని కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద విజ్ఞప్తి చేయడానికా అనేదానిపై ప్రచారం జోరుగా సాగుతోంది.