చెల్లిని సరిగ్గా చూసుకోవటం లేదని, స్నేహితుడి వద్ద తీసుకున్న అప్పు చెల్లించటం లేదని బావా పై పగ పెంచుకున్న ఓ బావమరిది హత్యకు పాల్పడిన సంఘటన కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం నాడు చోటు చేసుకోగా నేడు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఈ సందర్భంగా కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూకట్‌పల్లి ఏసిపి చంద్రశేఖర్ వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా కొహిర్ కు చెందిన అబ్దుల్ అన్వర్(27) 2019లో మియాపూర్ హఫీజ్ పేటకు చెందిన షరీన్ ను వివాహం చేసుకున్నాడు. షరీన్ సోదరుడు సయ్యద్ అహ్మద్, స్నేహితుడు మొహమ్మద్ అకీల్ వద్ద ఆటోను అద్దెకు తీసుకొని నడుపుతూ జీవిస్తూ ఉండేవాడు. అన్వర్ రోజు మద్యం సేవించి షరీన్ ను వేధించేవాడు. దానికి తోడు అకీల్ వద్ద అప్పుగా తీసుకున్న డబ్బులు, ఆటో అద్దె డబ్బులు చెల్లించకుండా, పూచీకత్తు పెట్టిన షరీన్ తల్లి పరువు పోగొట్టాడు అని అహ్మద్, తన బావా పై పగ కక్ష్య పెంచుకున్నాడు.
Also Read : Gandhari Jatara : అట్టహాసంగా ప్రారంభమైన గాంధారి జాతర
గత నెల 31వ తేదీన అహ్మద్ తన స్నేహితులు అకీల్, ఇమ్రాన్ లతో కలిసి అన్వర్ ను మద్యం సేవిద్దామని, ఆటోలో హఫీజ్ పేట్ రైల్వే ట్రాక్ వద్దకు తీసుకుని వెళ్లారు. అక్కడి నుండి బొరబండ మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్దకు వెళ్ళి మద్యం సేవిద్దామని ఫోన్ చేసిన ఇమ్రాన్ స్నేహితుడు అమీర్ తో కలిసి మద్యం సేవిస్తూ హఫీజ్ పేట్ బయలుదేరారు.అప్పటికే ఆటోలో గొడవపడుతున్న వారు, కె.పి.హెచ్.బి కాలనీ ముళ్ళకత్వ చెరువు వద్దకు రాగానే, నిర్మానుష్య ప్రదేశాన్ని గుర్తించి ఆటోను నిలిపివేశారు. అన్వర్ కిందకు దిగగానే అహ్మద్ బీర్ బాటిల్ తో దాడి చేశాడు. అక్కడి నుండి పారిపోయేందుకు అన్వర్ ప్రయత్నించగా అతడిని ఇమ్రాన్ కొట్టాడు కింద పడిన అన్వర్ చేతులను అహ్మద్ పట్టుకోగా, అకీల్ కాళ్ళను ఒడిసి పట్టుకున్నాడు. అక్కడే చెత్తలో దొరికి టైల్స్ ముక్కతో ఇమ్రాన్, అన్వర్ తల పై గొంతు పై దాడి చేసి హత్య చేశారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సయ్యద్ అమీర్ ను చంపుతానని బెదిరించారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఈ రోజు నిందితులను అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకొని, నిందితులు ముగ్గురిని రిమాండుకు తరలిస్తున్నామని ఏసిపి తెలిపారు.
Also Read : Jammu Kashmir: జైషే మహ్మద్ ఉగ్రవాదుల అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం
