NTV Telugu Site icon

Pawan Kalyan Dance Video: పవన్‌ కల్యాణ్‌ మాస్ డ్యాన్స్‌.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్‌!

Pawan Sai

Pawan Sai

Pawan Kalyan, Sai Dharam Tej and Thaman S Dance Video Goes Viral From BRO Movie: సుప్రీమ్ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా.. ‘పవర్‌స్టార్‌’ పవన్‌ కల్యాణ్‌ కీలక పాత్రలో నటించిన సినిమా ‘బ్రో’. కోలీవుడ్‌ సూపర్‌ హిట్‌ చిత్రం ‘వినోదాయ సితం’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు సముద్రఖని దర్శకుడు కాగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్​లో టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించిన బ్రో సినిమాలో కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ కథానాయికలు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జులై 28న థియేటర్లలో విడుదల కానుంది.

శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న బ్రో సినిమా ‘ప్రీ రిలీజ్‌’ ఈవెంట్.. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు చిత్ర యూనిట్ స్పెషల్‌ ట్రీట్‌ ఇచ్చింది. పవన్‌, సాయి తేజ్‌, తమన్‌కు సంబంధించిన ఓ డ్యాన్స్‌ వీడియో షేర్‌ చేసింది. ఈ వీడియోలో ‘నబో నబో నబ్బరిగాజులు’ పాటకు ముగ్గురు స్టెప్పులు వేశారు. పవర్‌స్టార్‌ అయితే మాస్ డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. తమ్ముడు చిత్రంలోని మాస్‌ గెటప్‌ను రీ క్రియేట్‌ చేస్తూ.. లుంగీ, కళ్లద్దాలతో స్టెప్పులు వేసి అదరగొట్టారు. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. చాలారోజుల తర్వాత పవన్‌ని మాస్‌ లుక్‌లో చూసిన ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Also Read: Viral Video: సిక్స్ కొట్టి మరీ ఔట్ అయ్యాడు.. ఎలాగో మీరే చూడండి! అయ్యో పాపమని అనకుండా ఉండలేరు

బ్రో సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు సంబంధించిన మరో వీడియో కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో వైష్ణవ్‌ తేజ్‌కు కాస్త సీరియస్‌ లుక్‌ ఇచ్చారు పవన్‌ కల్యాణ్‌. చిత్ర యూనిట్ గురించి మాట్లాడుతున్న పవన్‌.. మధ్యలో కాస్త గ్యాప్‌ ఇచ్చి వెనక్కి తిరిగారు. పక్కనే ఉన్న తేజ్.. నిర్మాత గురించి చెప్పాలని గుర్తు చేశారు. దీంతో పవన్‌ ఓ లుక్ ఇచ్చి.. చెప్తాను నేను ఎవర్నీ మర్చిపోను అని నవ్వుకుంటారు. ఇక ఇదే వేడుకలో తన మేనల్లుడు సాయి తేజ్‌కు పవన్‌ ఓ స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. ‘మై డియర్‌ మార్కండేయ’ పాటలో తాను ధరించిన గొలుసును తేజ్‌కు అందించారు.

Also Read: Tomato Price: రికార్డు స్థాయికి టమాటా ధర.. బెంబేలెత్తిపోతున్న కొనుగులుదారులు!