Pawan Kalyan Dance Video: పవన్ కల్యాణ్ మాస్ డ్యాన్స్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan, Sai Dharam Tej and Thaman S Dance Video Goes Viral From BRO Movie: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా.. ‘పవర్‌స్టార్’ పవన్ కల్యాణ్ కీలక పాత్రలో నటించిన సినిమా ‘బ్రో’. కోలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘వినోదాయ సితం’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు సముద్రఖని దర్శకుడు కాగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించిన బ్రో సినిమాలో కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ కథానాయికలు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జులై 28న థియేటర్లలో విడుదల కానుంది.
శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న బ్రో సినిమా ‘ప్రీ రిలీజ్’ ఈవెంట్.. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు చిత్ర యూనిట్ స్పెషల్ ట్రీట్ ఇచ్చింది. పవన్, సాయి తేజ్, తమన్‌కు సంబంధించిన ఓ డ్యాన్స్ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో ‘నబో నబో నబ్బరిగాజులు’ పాటకు ముగ్గురు స్టెప్పులు వేశారు. పవర్‌స్టార్ అయితే మాస్ డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. తమ్ముడు చిత్రంలోని మాస్ గెటప్‌ను రీ క్రియేట్ చేస్తూ.. లుంగీ, కళ్లద్దాలతో స్టెప్పులు వేసి అదరగొట్టారు. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలారోజుల తర్వాత పవన్‌ని మాస్ లుక్‌లో చూసిన ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.
Also Read
- Cyclone Alert : బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణం.. ఏపీకి అలర్ట్
- Home Gardening: ఖరీదైన కుండీలు కొనాల్సిన పనిలేదు.. ఇంట్లోని ఈ 6 పాత వస్తువులతో మొక్కలు పెంచేయండి!
- Tribal Employment : గిరిజన కుటుంబాలకు కొత్త జాబ్ కార్డులు.. కీలక ఆదేశాలు
- Sim binding: ‘‘సిమ్ లేకుంటే వాట్సాప్ పనిచేయదు’’.. జనవరి 1 నుంచి సిమ్ బైండింగ్ స్టార్ట్..
Also Read: Viral Video: సిక్స్ కొట్టి మరీ ఔట్ అయ్యాడు.. ఎలాగో మీరే చూడండి! అయ్యో పాపమని అనకుండా ఉండలేరు
బ్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన మరో వీడియో కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో వైష్ణవ్ తేజ్‌కు కాస్త సీరియస్ లుక్ ఇచ్చారు పవన్ కల్యాణ్. చిత్ర యూనిట్ గురించి మాట్లాడుతున్న పవన్.. మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చి వెనక్కి తిరిగారు. పక్కనే ఉన్న తేజ్.. నిర్మాత గురించి చెప్పాలని గుర్తు చేశారు. దీంతో పవన్ ఓ లుక్ ఇచ్చి.. చెప్తాను నేను ఎవర్నీ మర్చిపోను అని నవ్వుకుంటారు. ఇక ఇదే వేడుకలో తన మేనల్లుడు సాయి తేజ్‌కు పవన్ ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ‘మై డియర్ మార్కండేయ’ పాటలో తాను ధరించిన గొలుసును తేజ్‌కు అందించారు.
Also Read: Tomato Price: రికార్డు స్థాయికి టమాటా ధర.. బెంబేలెత్తిపోతున్న కొనుగులుదారులు!
తాజావార్తలు
-
OTT Release: సైలెంట్‌గా ఓటీటీలోకి రీసెంట్ బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
Cyclone Alert : బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణం.. ఏపీకి అలర్ట్
-
Home Gardening: ఖరీదైన కుండీలు కొనాల్సిన పనిలేదు.. ఇంట్లోని ఈ 6 పాత వస్తువులతో మొక్కలు పెంచేయండి!
-
Prabhas : ‘రాధేశ్యామ్’పై ప్రశాంత్ నీల్ సెటైర్.. సలార్ 2 టైంలో చూసుకుంటానన్నా ప్రభాస్
-
Tribal Employment : గిరిజన కుటుంబాలకు కొత్త జాబ్ కార్డులు.. కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!