Site icon NTV Telugu

Asaduddin Owaisi: ఉక్రెయిన్లో చిక్కుకున్న 12 మంది భారతీయులను తీసుకురండి.. కేంద్రానికి విజ్ఞప్తి

Asaduddin Owaisi

Asaduddin Owaisi

బ్రతుకు దెరువు కోసం విదేశాలకు వెళ్లి, అక్కడ ఏజెంట్ చేతిలో మోసపోయిన 12 మంది భారతీయులను తిరిగి వెనక్కు తీసుకురావాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. గత ఏడాది హైదరాబాద్ లోని నాంపల్లి బజార్ ఘాట్ ప్రాంతానికి చెందిన మహమూద్ అస్ఫాన్ తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మొత్తం12 మంది లేబర్ పని కోసం గల్ఫ్ దేశానికి వెళ్లారు. అక్కడి నుండి స్థానిక ఏజెంట్ ఎక్కువ జీతం వస్తుందని… వారిని రష్యా దేశంలో సెక్యూరిటీ లేబర్ గా పని చేయాలని రష్యాకు పంపించారు. అక్కడికి వెళ్లిన వారిని రష్యా ఆర్మీలో పని చేయించుకున్నారని… గత ఏడాది డిసెంబర్ 31న రష్యన్ ఆర్మీతో కలిసి ఉక్రెయిన్ దేశంలోకి వెళ్లిన అనంతరం వారి నుండి ఎలాంటి సమాచారం రాలేదని అసదుద్దీన్ తెలిపారు.

Read Also: Renuka Chaudhary: రాజ్యసభ ఎంపీ అవ్వడం బహుమతి కాదు.. బాధ్యత పెరిగింది

ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాసులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారని.. తిరిగి దేశానికి వద్దామంటే వారిని అక్కడి ఏజెంట్లు మోసం చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు, కర్ణాటక, గుజరాత్, యూపీ, జమ్మూకాశ్మీర్ ల నుండి వెళ్లిన 12 మంది ఉక్రెయిన్ లో చిక్కుకున్నారు. వారిని ఇండియాకు తీసుకు వచ్చేందుకు ప్రధాని, విదేశాంగ మంత్రులతో మాట్లాడుతానని ఒవైసీ చెప్పారు. కాగా, అసదుద్దీన్ ఓవైసీ అభ్యర్థనపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. గతంలో రష్యా-ఉక్రెయిన్ నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఆపరేషన్ తో ఇండియాకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

Read Also: Kejriwal: ఎన్నికల్లో గెలిచేందుకు ఆ పార్టీ ఎంతకైనా తెగిస్తుంది

Exit mobile version