పారిస్ ఒలింపిక్స్ నుంచి భారత్‌కు చేదువార్త వచ్చింది. 50 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ పోటీల్లో ఫైనల్స్‌కు చేరిన రెజ్లర్ వినేష్ ఫోగట్ ను అనర్హురాలిగా ప్రకటించారు. దీనిపై భారత రెజ్లింగ్ సంఘం మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కుమారుడు కరణ్ భూషణ్ స్పందించారు. కైసర్‌గంజ్‌కు చెందిన బీజేపీ ఎంపీ కరణ్ భూషణ్ మాట్లాడుతూ.. దేశం పతకం కోల్పోయిందన్నారు. దీనిపై సమాఖ్య అప్పీలు చేస్తుందని తెలిపారు. మరి ఇందులో ఏం జరుగుతుందో చూడాలని చెప్పారు.
READ MORE: Balka Suman : రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారింది
ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కరణ్ భూషణ్ పార్లమెంట్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చారు. ఆయన పార్లమెంట్ నుంచి బయటకు రాగానే ఓ జాతీయ మీడియా ఆయనను సంప్రదించింది. విలేకరి వినేష్ ఫోగట్ గురించి ప్రశ్నలు అడిగారు. “పార్లమెంట్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చాను. ఈ సమస్యపై పెద్దగా సమాచారం లేదు. ఇదే జరిగితే దేశం పతకం కోల్పోయినట్టే. ఈ అంశంపై కచ్చితంగా సమాఖ్య అప్పీలు చేస్తుంది. ఒకసారి మేము కూడా మాట్లాడుతాం. అసలేం జరిగింది. ఇక ముందు ఏం చేయాలో తెలుసుకుంటాం.” అని పేర్కొన్నారు.
READ MORE:Vinesh Phogat: అది పీడకల అయితే బాగుండు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్!
గతంలో బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలని వినేష్ ఫోగట్ డిమాండ్..
రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ బ్రిజ్‌భూషణ్ ను ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పక్కనబెట్టింది. అయితే ఆ స్థానంలో ఆయన కుమారుడికి టికెట్ కల్పించింది. ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ స్థానం నుంచి కరణ్ భూషణ్ సింగ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక రాయబరేలీ నుంచి దినేశ్ ప్రతాప్ సింగ్‌ను నిలబెట్టింది. కైసర్‌గంజ్ లోక్‌సభ స్థానానికి వరుసగా మూడు పర్యాయాలుగా బ్రిజ్‌భూషణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో 2లక్షల మెజార్టీతో విజయం సాధించారు. అయితే లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ గతేడాది జనవరిలో అగ్రశ్రేణి రెజ్లర్లు ఆయనకు వ్యతిరేకంగా రోడ్డెక్కి ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బ్రిజ్‌భూషణ్ పేరు వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలోనే రెజ్లింగ్ సమాఖ్య నుంచి వైదొలిగిన ఆయన క్రీడారాజకీయాలకు స్వస్తి పలికారు. అయితే ఆ స్థానం నుంచి కరణ్ భూషణ్ గెలుపొందాడు.
#WATCH | Delhi: On Indian wrestler Vinesh Phogat's disqualification from #ParisOlympics2024, BJP MP Karan Bhushan Singh says, "It is a loss for the country. The Federation will take this into consideration and see what can be done" pic.twitter.com/lSntbFF3kv
— ANI (@ANI) August 7, 2024