NTV Telugu Site icon

Bridegroom : పెళ్లి పనులు చేస్తూనే.. వరుడు అనంతలోకాలకు

Bride Groom

Bride Groom

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో పెళ్లికి ఒక్కరోజు ముందు వరుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఉట్నూర్‌లోని ఓ నగల షోరూమ్‌లో పనిచేస్తున్న రావుల సత్యనారాయణ చారి (34), శంకరయ్య ఏకైక కుమారుడు. గురువారం తెల్లవారుజామున వివాహానికి ముందు జరిగిన వేడుకల్లో పాల్గొని కుప్పకూలిపోయాడు. వెంటనే ఉట్నూర్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అక్కడి నుంచి ఆదిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌కు తరలించారు.

Also Read : Balakrishna Accident: హిందూపురంలో బాలయ్యకి తప్పిన ప్రమాదం

చికిత్స పొందుతూ మధ్యాహ్నం 2 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. సత్యనారాయణకు జగిత్యాలలోని మెట్‌పల్లికి చెందిన అమ్మాయితో నిశ్చితార్థం జరగగా, శుక్రవారం ఉదయం 11 గంటలకు వీరి వివాహం జరగాల్సి ఉంది. మరికొన్ని గంటల్లో పెళ్లిబాజాలు మోగాల్సిన ఇంట్లో పెళ్లికొడుకు చనిపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అప్పటివరకు తమ ముందు ఊషారుగా కనిపించిన కన్న కొడుకు చనిపోవటంతో… తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

Also Read : Google: భార్యాభర్తలకు షాకిచ్చిన గూగుల్.. ఒకేసారి ఇద్దరికి లేఆఫ్