NTV Telugu Site icon

Bride Pulls Off Gun: పాపం పెళ్లి కూతురు ఒకటి అనుకుంటే.. ఇంకోటి అయ్యింది..!

Bride Gun

Bride Gun

ఈ మధ్యకాలంలో పెళ్లికి ముందు లేదా పెళ్లిల్లో వెరైటీగా ఫోటో షూట్స్ తో అలరిస్తున్నారు. కొన్ని ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా పెళ్లిలో వధూవరులకు తుపాకీలు చేతిలో పట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అయితే.. అది కాస్త బెడిసి కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Also Read : US-Canada Border: అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు యత్నం.. భారతీయ కుటుంబం దుర్మరణం

భారతీయ వివాహాల్లో చాలా సంప్రదాయాలు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కో సంప్రదాయాన్ని ఫాలో అవుతూ ఉంటారు. కొన్ని సంప్రదాయాలు అందర్ని ఆకట్టకునేలా ఉంటే.. ఇంకొన్ని సంప్రదాయాలు బాబోయ్ ఇలాంటివి మళ్లీ ప్రయత్నించకూడదు అనేలా ఉంటాయి. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. పెళ్లిలో వధూవరులకు తుపాకీలను చేతిలో పట్టుకొని ఫోటోలకు పోజులు ఇచ్చారు. అయితే.. అది కాస్త బెడిసి కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.

Also Read : IPL 2023: చరిత్ర సృష్టించిన ధోని.. 12 ఏళ్ల రికార్డు బద్దలు

అదితి అనే మహిళ ఈ వీడియోని నెట్టింట షేర్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది. ఈ 13 సెకన్ల క్లిప్ లో, వధూవరులు వేదికపై ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు. ఆ జంట చేతిలో మెరుపులు వచ్చే తుపాకులు ఉన్నాయి. వారు తుపాకీ బటన్ నొక్కినప్పుడు అందులో నుంచి క్రాకర్స్ వస్తూ ఉంటాయి. అయితే వధువు తుపాకీ నొక్కినప్పుడు అది మిస్ ఫైయిర్ అయ్యి అది కాస్త పేలింది. ఆమె ముఖానికి తగిలింది. ఈ వీడియో చూసినవారంతా.. అయ్యో పాపం పెళ్లి కూతురు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమెపై జాతి పడుతున్నారు.

Show comments