NTV Telugu Site icon

Madhya Pradesh : పెళ్లి వేదికపై విషాదం.. విషం తాగిన వధూవరులు

Marriage

Marriage

Madhya Pradesh : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలో ఘోరం జరిగింది. పెళ్లి తంతు జరుగుతుండగానే నవ దంపతులు విషం తాగారు. ఈ ఘటనలో పెళ్లికొడుకు మరణించగా.. నవ వధువు ఆస్పత్రిలో విషమ పరిస్థితిలో చికిత్స పొందుతుంది. మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు యువతి(20), యువకుడు(21) ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ, కెరీర్ నిర్మించుకోవాలని, కొంత నిలదొక్కుకున్నాకే పెళ్లి చేసుకోవాలని ఆ యువకుడు భావించాడు. ఇందులో భాగంగానే పెళ్లిని రెండేళ్లపాటు వాయిదా వేయాలని తన ప్రేయసికి వివరించాడు. కానీ యువతి అంగీకరించలేదు. వెంటనే పెళ్లి చేసుకుందామంటూ డిమాండ్ చేసింది.

Read Also:Delhi: ఢిల్లీ తదుపరి సీఎస్‌ పీకే గుప్తా!.. కేంద్ర అనుమతిని కోరిన ఆప్ సర్కారు

కొన్ని రోజులుగా పెళ్లి గురించి ఆమె తరుచూ అడుగుతున్నట్టు తెలిసింది. ఎట్టకేలకు వారి పెళ్లి ఆర్య సమాజ్ లో నిర్వహించడానికి పెద్దలు నిర్ణయించారు. పెళ్లికి అంతా సిద్ధమైంది. కానీ, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుల మధ్య మరోసారి గొడవ జరిగింది. మనస్తాపంతో పెళ్లి కొడుకు విషం తాగాడు. ఈ విషయం పెళ్లి కూతురుకు తెలిసింది. వెంటనే వెళ్లి ఆమె కూడా ఆ విషాన్ని తాగింది. ఆ యువకుడిని హాస్పిటల్‌కు తరలించారు. కానీ, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ప్రకటించినట్లు ఏఎస్ఐ రంజాన్ ఖాన్ తెలిపారు. కాగా, ఆ మహిళ ఆరోగ్యం మాత్రం విషమంగా ఉందని లైఫ్ సపోర్ట్ పై ఉంచినట్టు చెప్పారు. యువతి పెళ్లి చేసుకుందామంటూ తమ కొడుకును వేధింపులకు గురిచేసిందని పెళ్లి కొడుకు కుటుంబం ఆరోపిస్తోంది. కెరీర్లో స్థిరపడడానికి రెండేళ్లుపడుతుందని అప్పటివరకు ఆగుదామన్నా ఆమె వినలేదని యువకుడి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వివరించారు.

Read Also:Deepthi Sunaina: లేనిది కనిపించదు వున్నది పోదు.. ఎందుకమ్మ దీప్తి నీకా పోజులు