Nandamuri Chaitanya Krishna’s Breathe Movie streaming on Aha: నందమూరి చైతన్య కృష్ణ హీరోగా నటించిన సినిమా ‘బ్రీత్’. ఈ సినిమాకు వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించగా.. బసవతారకరామ క్రియేషన్స్ బ్యానర్‌పై జయకృష్ణ నిర్మించారు. ఈ సినిమాలో వైదిక సెంజలియా హీరోయిన్‌గా నటించింది. గత ఏడాది డిసెంబర్ 2న థియేటర్లలో రిలీజైన బ్రీత్ సినిమా.. భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాపై బజ్ లేకపోవడం, సరైన ప్రమోషన్స్ కూడా చేయకపోవడంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది.
థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత బ్రీత్ మూవీ ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్‌కి మార్చి 8న ముహూర్తం కాహారారు చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవనుంది. మహిళా దినోత్సవం, మహా శివరాత్రి సందర్భంగా బ్రీత్ చిత్రంను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. థియేటర్లో మిస్ అయిన ఆడియన్స్ ఎంచక్కా ఇంట్లోనే ఓటీటీలో చూసుకోవచ్చు.
Also Read: Multi-Starrer Movie: టాలీవుడ్‌లో మరో మల్టీస్టారర్.. అడివి శేషుతో దుల్కర్ సల్మాన్!
నందమూరి బాలకృష్ణ అన్నయ్య జయకృష్ణ వారసుడిగా చైతన్య కృష్ణ ‘బ్రీత్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కొడుకును హీరోగా పరిచయం చేయడం కోసం జయకృష్ణ స్వయంగా ఈ సినిమాను నిర్మించాడు. దాదాపు నాలుగు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ.. భారీ డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో చైతన్య కృష్ణ, జయకృష్ణకు నిరాశే మిగిలింది. బ్రీత్ కంటే ముందు చైతన్య కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించాడు. బ్రీత్ సినిమా హీరోగా అతడి మొదటి సినిమా కావడం గమనార్హం.