NTV Telugu Site icon

Breaking News: హైదరాబాద్‌ నగరంలో మరోమారు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

Ganj

Ganj

Breaking News: హైదరాబాద్‌ నగరంలో మాదకద్రవ్యాల సరఫరాను అరికట్టేందుకు పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా, చదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలక్‌పేట్ నల్లగొండ క్రాస్ రోడ్ వద్ద 60 కేజీల గంజాయిని సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కారులో గంజాయి తరలింపు జరుగుతుందని తెలుసుకున్న పోలీసులు, అక్కడే గట్టి నిఘా పెట్టి దాడి నిర్వహించారు. దాడి సమయంలో 60 కేజీల గంజాయిని పట్టుకుని, వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఈ కేసు సంబంధించిన మరిన్ని వివరాలను రాబట్టేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Also Read: Mrunal Thakur : మరో బంపర్ ఆఫర్ అందుకున్న మృణాల్ ఠాకూర్

స్వాధీనం చేసిన గంజాయితో పాటు నిందితులను చాదర్ ఘాట్ పోలీసులకు అప్పగించారు. మాదకద్రవ్యాల సరఫరా వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. గంజాయి సరఫరా వెనుక ఉన్న ముఠా సభ్యుల వివరాలు వెలికితీసి, నేరస్థులను చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసు శాఖ కృషి చేస్తోంది. ప్రజలు కూడా మాదకద్రవ్యాల అరికట్టడంలో సహకరించాలని, ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.