Breaking News: హైదరాబాద్ నగరంలో మరోమారు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
- హైదరాబాద్ నగరంలో మరోమారు గంజాయి స్వాధీనం
- 60 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Breaking News: హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాల సరఫరాను అరికట్టేందుకు పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా, చదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలక్‌పేట్ నల్లగొండ క్రాస్ రోడ్ వద్ద 60 కేజీల గంజాయిని సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కారులో గంజాయి తరలింపు జరుగుతుందని తెలుసుకున్న పోలీసులు, అక్కడే గట్టి నిఘా పెట్టి దాడి నిర్వహించారు. దాడి సమయంలో 60 కేజీల గంజాయిని పట్టుకుని, వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఈ కేసు సంబంధించిన మరిన్ని వివరాలను రాబట్టేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Also Read: Mrunal Thakur : మరో బంపర్ ఆఫర్ అందుకున్న మృణాల్ ఠాకూర్
Also Read
స్వాధీనం చేసిన గంజాయితో పాటు నిందితులను చాదర్ ఘాట్ పోలీసులకు అప్పగించారు. మాదకద్రవ్యాల సరఫరా వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. గంజాయి సరఫరా వెనుక ఉన్న ముఠా సభ్యుల వివరాలు వెలికితీసి, నేరస్థులను చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసు శాఖ కృషి చేస్తోంది. ప్రజలు కూడా మాదకద్రవ్యాల అరికట్టడంలో సహకరించాలని, ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు