బీజేపీ అధ్యక్షుడి మార్పుకు అవకాశమే లేదని స్పష్టం చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధ్యక్షుడి మార్పుపై వస్తోన్న వార్తలు బేస్ లెస్ అన్నారు. మేమంతా ఒక కుటుంబమని, మా జాతీయ నేతలను రాష్ట్ర నేతలు కలవటం సహజమన్నారు. కవిత అరెస్ట్ మా చేతుల్లో లేదు. విచారణ పరిధిలోని అంశమన్నారు కిషన్ రెడ్డి. అంతేకాకుండా.. ‘ఆధారాలున్నాయి కాబట్టే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని సీబీఐ అరెస్ట్ చేసింది. అవినీతికి పాల్పడిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేను సైతం జైలుకు పంపించాం.
Also Read : Bengaluru Rains: బెంగళూర్‌లో భారీ వర్షం.. ఏపీకి చెందిన ఒకరు మృతి..
మహారాష్ట్రలో బీఆర్ఎస్ ను ఎంఐఎం పార్టీ నడిపిస్తోంది. మహారాష్ట్రలో ఒక వార్డ్ మెంబర్ గెలిచినందుకే సంబుర పడుతున్నారు. రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణను అవినీతిపరులే వ్యతిరేకిస్తున్నారు. నోట్ల రద్దులో మా ప్లాన్ మాకు ఉంది. కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణలో ఉండదు. కాంగ్రెస్ కు తెలంగాణలో భవిష్యత్తు లేదు.. బీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం. పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలి. కేంద్రనీ విమర్శించడమే పని గా పెట్టుకున్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ సలహాదారులకు అప్పగించారు.’ అంటూ కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
kishan reddy fires on cm kcr
