రోజు రోజుకు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అవకాశం దొరికితే చాలు అమాయకులకు వలవేసి అందినకాడికి దండుకుంటున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షల్లో డబ్బులు వసూలు చేసి మోసం చేసిన దంపతులపై చర్యలు తీసుకోవాలని బాధిత నిరుద్యోగ యువతి, యువకులు, రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. హైద్రాబాద్, ఎల్బీనగర్ కు చెందిన చంద్రశేఖర్, సుమ ఇద్దరు దంపతులు అమాయక నిరుద్యోగులను ఆసరాగా చేసుకుని బెంగుళూరులో తీసిఎస్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆన్లైన్ ద్వారా నిరుద్యోగులను మభ్యపెట్టి 40లక్షలు వసూలు చేశారని బాధితులు కమిషన్ కు వివరించారు.
Also Read : Womens T20 World Cup: విండీస్‌తో పోరుకు హర్మన్‌సేన రెడీ..మంధానా వచ్చేసింది!
ఇప్పుడు అడిగితే మీ డబ్బులు ఇవ్వం ఏం చేసుకుంటారో చేసుకొర్రీ అంటే… ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన తమను పట్టించుకోకుండా నిందితులతో కుమ్మకై తమకు న్యాయం చేయడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ డబ్బులు తిరిగి ఇచ్చేవిధంగా నిందితులపై చర్యలు తీసుకొని, బాధితుల పక్షాన నిలబడి న్యాయం చేయాల్సిన పోలీసులు నిందితులకు వత్తాసు పలికిన ఎల్బీనగర్ పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు విజ్ఞప్తి చేశారు.
Also Read : Sajjan Jindal: వైఎస్ లేని లోటు ఎవరూ పూడ్చలేరు.. సీఎం జగన్ నాయకత్వంపై ఇతర రాష్ట్రాల్లో చర్చ..
