NTV Telugu Site icon

Hanumakonda: పట్టపగలే నడిబొడ్డులో దారుణం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య

Crime

Crime

Hanumakonda: వరంగల్ జిల్లా హనుమకొండలోని రోహిణి ఆసుపత్రి ముందు ఇద్దరు ఆటో డ్రైవర్ల మధ్య జరిగిన గొడవ ఒక వ్యక్తి హత్యకు దారి తీసింది. వివరాల ప్రకారం, రెండు ఆటో డ్రైవర్ల మధ్య వివాదం మొదలవ్వగా.. ఈ గొడవ సమయంలో ఒక డ్రైవర్ మరో డ్రైవర్‌పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో అతను మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు కారణమైన గొడవపై పోలీసులు మరింత సమాచారం సేకరిస్తున్నారు.

Also Read: Delhi Elections 2025: ఢిల్లీలో చైనీస్ సీసీటీవీ కెమెరాల వివాదం.. ఆప్- బీజేపీ మధ్య మాటల యుద్ధం..

ఇకపోతే, అదాలత్ జంక్షన్ సమీపంలో ఉన్న రోహిణి ఆసుపత్రి ముందు జరిగిన ఘటనలో మృతుడు మడికొండకు చెందిన మాచర్ల రాజ్ కుమార్ గా పోలీసులు గుర్తించారు. ఇకపోతే గోడవకు వివాహేతర సంబంధం కారణమని తెలుస్తోంది. మాచర్ల రాజ్ కుమార్ అనే వ్యక్తిని ఏనుగు వెంకటేశ్వర్లు కత్తితో పొడిచి చంపారు. బొల్లికుంటలో మహిళతో ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణం అని సమాచారం. ఈ విషయమై ఇద్దరి మధ్య మాట మాట పెరిగి రాజ్ కుమార్ ను హత్య చేసాడు వెంకటేశ్వర్లు. మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు పోలీసులు.