Bhatti Vikramarka: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిన్న నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లిలో పాదయాత్ర చేస్తుండగా అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. నిన్న 97వ రోజు పాదయాత్ర చేస్తున్న సమయంలో వడదెబ్బకు గురై తీవ్ర జ్వరంతో బాధపడుతున్న భట్టి విక్రమార్కకు ఈరోజు ఉదయం వైద్య పరీక్షలు చేశారు. సూర్యాపేట నుండి వచ్చిన ప్రత్యేక వైద్యులు.. ఈసీజీ, బిపి, బ్లడ్ టెస్ట్ చేశారు. వైద్యుల సూచన వరకు ఈరోజు జరగాల్సిన పాదయాత్రను రద్దు చేసుకున్నారు. భట్టి విక్రమార్క ఆరోగ్యం నిలకడగా ఉందని.. డిహైడ్రేషన్, జ్వరం, నీరసంతో భట్టి విక్రమార్క ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు తెలిపారు. విశ్రాంతి అవసరమని వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు సూచించారు.
Read Also: Disha SOS Effect: అనుమానంతో ప్రియురాలిపై దాడి.. ‘దిశా’ దెబ్బకి బుద్ధొచ్చింది!
అయితే మరోసారి సాయంత్రం భట్టి విక్రమార్కకు వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు. మరో 24 గంటలు భట్టి విక్రమార్కకు విశ్రాంతి అవసరం అని తెలిపారు. జ్వరం నార్మల్ గా ఉన్నప్పటికీ.. బాగా నీరసంగా ఉన్నారని డాక్టర్లు చెబుతున్నారు. ఈసీజీ, బిపి, బ్లడ్ టెస్ట్ లు కూడా నార్మల్ గా ఉన్నాయన్నారు. అయితే రేపు క్లినికల్ పరీక్షల తర్వాతే పాదయాత్ర పై నిర్ణయం తీసుకోనున్నట్లు భట్టి సంబంధీకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు రేపు కూడా బ్రేక్ పడనుంది.