భారత్ లో పర్యటనకు ముందు ఆసీస్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో కమిన్స్ మణికట్టుకు గాయమైంది. అయినప్పటికీ కమిన్స్ గాయంతోనే సిరీస్ ఆడాడు. దానివల్ల అతనికి నొప్పి ఎక్కువ కావడంతో.. కీలకమైన వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని, భారత్ లో జరిగే వన్డే సిరీస్ కు కమిన్స్ కు విశ్రాంతినివ్వాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆలోచిస్తోంది.
సాయంత్రం భట్టి విక్రమార్కకు వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు. మరో 24 గంటలు భట్టి విక్రమార్కకు విశ్రాంతి అవసరం అని తెలిపారు. జ్వరం నార్మల్ గా ఉన్నప్పటికీ.. బాగా నీరసంగా ఉన్నారని డాక్టర్లు చెబుతున్నారు. ఈసీజీ, బిపి, బ్లడ్ టెస్ట్ లు కూడా నార్మల్ గా ఉన్నాయన్నారు. అయితే రేపు క్లినికల్ పరీక్షల తర్వాతే పాదయాత్ర పై నిర్ణయం తీసుకోనున్నట్లు భట్టి సంబంధీకులు చెబుతున్నారు.