Brahmos Misfire: గతేడాది పాకిస్థాన్‌లో అనుకోకుండా బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగించడంతో ప్రభుత్వ ఖజానాకు రూ.24 కోట్ల నష్టం వాటిల్లడంతో పాటు పొరుగు దేశంతో సంబంధాలు దెబ్బతిన్నాయి. ఢిల్లీ హైకోర్టులో కొనసాగుతున్న వ్యాజ్యంపై కేంద్ర ప్రభుత్వం ఈ సమాచారం ఇచ్చింది. ఆ తప్పుకు ముగ్గురు వైమానిక దళ అధికారుల సర్వీస్‌ను రద్దు చేసే చర్యను ప్రభుత్వం సమర్థించింది. మీడియా నివేదికల ప్రకారం.. భారత వైమానిక దళానికి చెందిన ముగ్గురు వింగ్ కమాండర్ల తొలగింపును కోర్టులో కేంద్ర ప్రభుత్వం సమర్థించింది. కాగా, వింగ్ కమాండర్ అభినవ్ శర్మ తొలగింపును వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కానీ తమ చర్య సరైనదేనని, ఈ అధికారులు క్షిపణి ప్రయోగ విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారని కేంద్రం .. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో తెలిపింది.
Read Also:Srikanth Addala: ‘నారప్ప’ డైరెక్టర్.. ‘అఖండ’ విశ్వరూపం.. PK తోనా..?
వీరిని కోర్టు మార్షల్ విచారించిందని, అత్యంత సెన్సిటివ్ విషయమైన మిసైల్ ప్రయోగం విఫలం కావడం పట్ల అంతర్జాతీయ దేశాలు కూడా .. ప్రాక్టీస్ డీటైల్స్ ని తెలుసుకోగోరాయని పేర్కొంది. దేశ భద్రతను దృష్టిలోనుంచుకుని ఈ అధికారిని తొలగించడం జరిగిందని కేంద్రం తరఫు న్యాయవాది వివరించారు. 23 సంవత్సరాల తరువాత భారత వైమానిక దళం ఇలాంటి నిర్ణయం తీసుకోవలసి వచ్చిందన్నారు. అయితే 1950 నాటి ఎయిర్ ఫోర్స్ యాక్ట్ లోని 18 సెక్షన్ కింద తనను తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను అభినవ్ శర్మ సవాలు చేస్తూ, ఈ విధమైన ఆపరేషన్లకు తన విధులు వర్తించవని, ఇది పూర్తిగా సహజ సిద్ధమైన యాదృచ్చిక ఘటనే అని అన్నారు. ఘటన జరిగిన సమయంలో ఇంజినీరింగ్ అధికారిగా విధులు నిర్వర్తించారు. తనకు మెయింటెనెన్స్ శిక్షణ మాత్రమే ఇచ్చారని అభినవ్ శర్మ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. వారికి కార్యాచరణ శిక్షణ ఇవ్వలేదు. వారు తమ విధులను చక్కగా నిర్వర్తించారు. ఆపరేషన్‌ను నియంత్రించే అన్ని పోరాట SOPలను అనుసరించారు. ఈ వాదనలు విన్న కోర్టు.. రక్షణ మంత్రిత్వ శాఖకు, ఎయిర్ స్టాఫ్ చీఫ్ కు, మరికొందరికి నోటీసులు జారీచేసింది ఆరు వారాల్లోగా వివరణాత్మక సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది.
Read Also:Balineni Srinivasa Reddy: చంద్రబాబు ఎన్ని మేనిఫెస్టోలు ప్రకటించినా.. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు