Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Brahmanandam Birthday Special 2

Brahmanandam: నవ్వుకే నవ్వు పుట్టించిన ఘనుడు!

Published Date :February 1, 2023 , 6:41 am
By Prasanna Pradeep
Brahmanandam: నవ్వుకే నవ్వు పుట్టించిన ఘనుడు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Brahmanandam: మొన్నటి దాకా తీరిక లేకుండా నవ్వులు పండించిన హాస్యనటబ్రహ్మ బ్రహ్మానందం ఇప్పటికీ తన దరి చేరిన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేస్తూనే ఉన్నారు. నవ్వులు మన సొంతం చేస్తూనే ఉన్నారు. కేవలం నటించడమే కాదు, తనలో చిత్రలేఖనం అనే కళ కూడా పరిపూర్ణంగా ఉందని చాటుకున్నారు బ్రహ్మానందం. కరోనా సమయంలో ఖాళీ దొరకడంతో బ్రహ్మానందంలోని చిత్రకళ బహిర్గతమై పలు అపురూప చిత్రాలను జనం ముందు నిలిపింది. అయినా, ఆయన నవ్వుల బ్రహ్మానందంగానే జనానికి సుపరిచితులు. ఆయన నవ్వులు కేవలం తెలుగువారినే కాదు, తెలుగు అర్థం కాని వారినీ అలరించాయి. తెలుగు నుండి తమ భాషల్లోకి అనువాదమైన చిత్రాలలో బ్రహ్మానందం హాస్యాభినయం చూసి పరభాషల వారు సైతం కితకితలకు గురవుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఏ ముహూర్తాన ఆయన కన్నవారు బ్రహ్మానందం అని నామకరణం చేశారో కానీ, అందరికీ ఆనందం పంచడానికే ఈ బ్రహ్మానందం అన్నట్టుగా ఆయన చలన చిత్రజీవితం సాగింది.

కన్నెగంటి బ్రహ్మానందం 1956 ఫిబ్రవరి 1న గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జన్మించారు. ఎంతగా నవ్వులు పూయించినా, శ్రద్ధగా చదువుకొని అధ్యాపకునిగా మారారు. అత్తిలిలో అధ్యాపకునిగా కొనసాగుతూనే బ్రహ్మానందం పలు సాంస్కృతిక కార్యక్రమాలలో తన స్వరఅనుకరణతో అలరించే వారు. దూరదర్శన్ లో బ్రహ్మానందం పండించిన ‘పకపకలు’ ఇప్పటికీ గుర్తు చేసుకొని నవ్వుకొనేవారెందరో! జంధ్యాల ‘సత్యాగ్రహం’లో ఓ చిన్న పాత్రలో తొలిసారి కనిపించారు బ్రహ్మానందం. వేజెళ్ళ సత్యనారాయణ ‘శ్రీతాతావతారం’లోనూ ఓ బిట్ రోల్ చేశారు. జంధ్యాల ‘అహ నా పెళ్ళంట’లో అరగుండుగా నటించి, అందరికీ దగ్గరయ్యారు బ్రహ్మానందం. ఆ తరువాత ఆయన మరి వెనుదిరిగి చూసుకోలేదు. అందిన ప్రతీ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ సాగారు. అందరికీ నవ్వులు పంచుతూనే తెలుగునాట హాస్యనటుల్లో అగ్రస్థానం అధిరోహించారు. బ్రహ్మానందానికి ముందు రేలంగి, అల్లు రామలింగయ్య ఇద్దరూ తమదైన హాస్యంతో పకపకలు పండించారు. వారిద్దరికీ పద్మ పురస్కారం లభించింది. వారి తరువాత తెలుగునాట ‘పద్మ’ పురస్కారం అందుకున్న నవ్వుల రేడు బ్రహ్మానందమే!

ఒకటా రెండా వందలాది చిత్రాల్లో బ్రహ్మానందం పండించిన నవ్వులు జనానికి కితకితలుపెట్టాయి. ఈ నాటికీ వాటిని తలచుకుంటే చాలు గొల్లున నవ్వులు రాలతాయి. బ్రహ్మానందం హాస్యానికి ఇప్పటికి ఐదు సార్లు నంది పురస్కారాలు దక్కాయి. “మనీ, అనగనగా ఒక రోజు, వినోదం, రెడీ, రేసుగుర్రం” చిత్రాలతో ఉత్తమ హాస్యనటునిగా ఐదు నందులు అందుకున్నారు. ఈ కామెడీ కింగ్ కరుణరసంతోనూ మురిపించిన సందర్భాలున్నాయి. అలా ఉత్తమ సహాయనటునిగానూ ‘అన్న’తో నందిని పట్టుకుపోయారు. ఇలా ఆరు సార్లు నందిని అందుకున్న బ్రహ్మానందం, వెయ్యికి పైగా చిత్రాలలో నటించి, ఈ నాటికీ నవ్వులు పూయిస్తున్న హాస్యనటునిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్స్ లోనూ చోటు సంపాదించారు.

తెలుగు హాస్యనటుల చరిత్ర రాయవలసి వస్తే, బ్రహ్మానందానికి ముందు, బ్రహ్మానందానికి తరువాత అని రాయాలని పలువురు ప్రముఖులు ప్రశంసించిన సందర్భాలున్నాయి. బ్రహ్మానందం కామెడీతో జనానికి కడుపులు చెక్కలు కావడం మొదలయిన తరువాత నుంచీ హాస్యాభినయంపై మమకారం పెంచుకున్న వారెందరో ఉన్నారు. బ్రహ్మానందం చూపిన బాటలో ‘మిమిక్రీ’ చేస్తూ హాస్యం పంచవచ్చునని భావించిన వారు తొలుత స్వర అనుకరణతో జనాన్ని మెప్పించి, తరువాత చిత్రసీమలో రాణించారు. అలాంటివారికి సైతం బ్రహ్మానందం తగిన ప్రోత్సాహమిచ్చారు. ఇక తమ హాస్యనటుల్లో కూడా కథానాయకులుగా రాణించగల దిట్టలు ఉన్నారంటే, వారికీ తగిన ప్రోత్సాహం అందించారు. తమ హాస్యకుటుంబంలోని కొందరు సభ్యులు దర్శకులుగా మారడానికీ ఆయన ప్రోత్సాహమే కారణం. అందుకే తెలుగు సినిమా హాస్య చరిత్రలో బ్రహ్మానందంకు ముందు, తరువాత అని రాయాల్సి ఉంటుందని అంటారు. ఏది ఏమైనా బ్రహ్మానందం పేరు వినగానే అసంకల్పితంగా కితకితలు మొదలవుతాయి, తరువాత మన పెదాలపై నవ్వులు నాట్యం చేస్తాయి. ఆయన మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగాలని ఆశిద్దాం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • brahmanandam birthday Special
  • comedy king brahmanandam
  • happy birthday brahmanandam
  • tollywood comedian brahmanandam birthday special

తాజావార్తలు

  • Raakaasaa:సంగీత్ శోభన్ ఖాతాలో మరో హిట్? ‘రాకాస’ మొదటి రోజు వసూళ్లు ఇవే!

  • Rahul Gandhi: మోడీ ఇప్పుడు ట్రంప్ నియంత్రణలో ఉన్నారు.. కేరళ ప్రచారంలో రాహుల్ గాంధీ విసుర్లు

  • Healthy Breakfast for Diabetics: మందులు లేకుండానే షుగర్ కంట్రోల్.. పూర్వీకులు తిన్న ఈ ‘ఆహారం’ సింపుల్‌గా ఇలా చేసేయండి!

  • CM Chandrababu: అమరావతి నిర్మాణంలో రాజీ పడొద్దు.. నిర్మాణ సంస్థలకు సీఎం ఆదేశాలు!

  • Ragi Ambali: అమ్మమ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. హాట్ హాట్ వేసవిలో శక్తిని ఇచ్చే హెల్తీ, టేస్టీ రాగి అంబలి!

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions