Brahmanandam: హాస్య బ్రహ్మ, మీమ్ గాడ్, గాడ్ ఆఫ్ కామెడీ.. ఇలా లెక్కలేనన్ని పేర్లు ఆయన సొంతం. ఆయనను చూడగానే కాదు ఆయన పేరు విన్నా కూడా నవ్వొచ్చేస్తుంది. ఆయనే బ్రహ్మానందం కన్నెగంటి. బ్రహ్మీ.. జంధ్యాల వదిలిన ఒక బాణం. ఆ ఒక్కటి అడక్కు సినిమాతో ఆయనను ఇండస్ట్రీకి పరిచయం చేసారు. ఆ ఒక్క సినిమా నుంచి దాదాపు 1000 సినిమాలకు పైగా ఆయన నటించేలా చేసింది.
Brahmanandam: మొన్నటి దాకా తీరిక లేకుండా నవ్వులు పండించిన హాస్యనటబ్రహ్మ బ్రహ్మానందం ఇప్పటికీ తన దరి చేరిన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేస్తూనే ఉన్నారు. నవ్వులు మన సొంతం చేస్తూనే ఉన్నారు. కేవలం నటించడమే కాదు, తనలో చిత్రలేఖనం అనే కళ కూడా పరిపూర్ణంగా ఉందని చాటుకున్నారు బ్రహ్మానందం.