NTV Telugu Site icon

Brahma Anandam: ఓటీటీలో ‘బ్రహ్మా ఆనందం’ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Brahma Anandam

Brahma Anandam

బ్రహ్మ ఆనందం అనే పేరుతో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. ఎందుకంటే ఈ సినిమాలో బ్రహ్మానందం ప్రధాన పాత్రలో, ఆయన కొడుకు రాజా గౌతమ్ మనవడిగా నటించారు. వెన్నెల కిషోర్ మరో కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో సినిమా మీద అంచనాలను పెంచింది. ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ అయ్యింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు టీమ్ వెల్లడించింది. ఆహా వేదికగా ఇది మార్చి 14 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

READ MORE: SIPB Meeting: ఎస్‌ఐ‌పీబీ సమావేశం.. రూ.1,21,659 కోట్ల పెట్టుబడులకు ఆమోదం

బ్రహ్మ ఆనందం కథ:
బ్రహ్మానందం(రాజా గౌతమ్) ఒక థియేటర్ ఆర్టిస్ట్. ఎప్పటికైనా సినిమాల్లో బిజీ అవ్వాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అతని స్నేహితుడు గురు(వెన్నెల కిషోర్) డాక్టర్ అతని సంపాదనతోనే బ్రహ్మానందం కాలం వెళ్ళదీస్తూ ఉంటాడు. చిన్నప్పుడే తన తండ్రిని కోల్పోయిన బ్రహ్మానందం తన బాబాయ్(ప్రభాకర్) కుమార్తే రాశి (దివిజ)తో మాత్రం తనకి సంబంధించిన అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాడు.. ఒకరోజు దివిజ వృద్ధాశ్రమంలో ఉన్న తాత ఆనంద మూర్తి (బ్రహ్మానందం) కలవాలనుకుంటున్నాడని అన్నను అక్కడికి తీసుకు వెళుతుంది. అయినా పెద్దగా ఆసక్తి చూపకుండా బయటకు వచ్చేస్తాడు బ్రహ్మానందం. సరిగ్గా ఇదే సమయంలో తన లైఫ్ మొత్తాన్ని మార్చేసేలా ఢిల్లీలో నాటకం వేయాలంటే ఆరు లక్షల ఖర్చు అవుతుందని బ్రహ్మానందానికి తెలుస్తుంది. ఆ 6 లక్షల కోసం వేట మొదలు పెడితే ఎక్కడా దొరకవు.

READ MORE: Amaravati: వైసీపీ అధినేత జగన్‌ను కలిసిన పిన్నెల్లి గ్రామస్తులు..

అయితే తనకు ఉన్న ఆరెకరాలను నీ పేరు మీద రాస్తానంటూ అతన్ని ఒక ఊరికి తీసుకువెళతాడు తాత మూర్తి. ఆ ఊరికి వెళ్ళాక జరిగిన పరిణామాలు ఏమిటి? బ్రహ్మానందానికి ఆస్తి దక్కిందా? ఢిల్లీలో నాటకం ఆడడానికి తగిన మొత్తాన్ని సిద్ధం చేయగలిగాడా? ఈ కథలో జ్యోతి(తాళ్లూరి రామేశ్వరి) ప్రమేయం ఏంటి? అలాగే బ్రహ్మానందం కోసం తన జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆరు లక్షలు ఇవ్వడానికి సిద్ధమైన తార(ప్రియా వడ్లమాని) అతన్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది? చివరికి ఏం జరిగింది అనే విషయం తెలుసుకోవాలంటే ఈ సినిమాను ఓటీటీలో చూసేయండి.