Site icon NTV Telugu

Dr. BR Ambedkar : పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్‌ విగ్రహం.. తెలంగాణ సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌

Ambedkar Statue

Ambedkar Statue

హైదరాబాద్‌లోని పంజాగుట్ట చౌరస్తాలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా వచ్చే నెల 14న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో విగ్రహ ఏర్పాటు పనులను స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి చాలా ఏండ్లుగా డిమాండ్‌ ఉన్నదని, దీనిపట్ల మంత్రి కేటీఆర్‌ సానుకూలంగా స్పందించారని చెప్పారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా విగ్రహం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నామని స్పష్టం చేశారు.

Also Read : Amritpal Singh: వేషం మార్చిన అమృత్‌పాల్‌… కొత్త లుక్‌లో ఖలిస్థానీ మద్దతుదారుడు

అయితే.. నాలుగేళ్ల క్రితం అక్క ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ విగ్రహాన్ని అనుమతి లేదంటూ.. గోషామహల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు వి. హనుమంతరావు పంజాగుట్ట చౌరస్తాలోనే అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ పలుమార్లు నిరసనలు తెలిపారు. అయితే.. ఇటీవల సీఎల్పీనేత భట్టి విక్రమార్క నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి బృందం సీఎస్ శాంతికుమారిని కోరింది. అంతేకాకుండా మంత్రి కేటీఆర్‌ దృష్టి ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించి అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటుకు కృషి చేసినట్లు బీఆర్‌ఎస్‌ నేతలు చెప్పుకొచ్చారు.

Also Read : Etela Rajender : ఇంతకంటే సిగ్గుమాలినతనం ఉందా?

Exit mobile version