Boys Hostel : ఓటీటీ లోకి వచ్చేసిన యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటీటీ హవా మొదలవగానే బాష తో సంబంధం లేకుండా ప్రేక్షకులు సినిమాలు చూడటం మొదలు పెట్టారు..మలయాళం, తమిళ, కన్నడ భాషల్లో రిలీజైన సినిమాలు ఇప్పుడు తెలుగులో డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తున్నాయి.అలా కన్నడ లో సూపర్ హిట్ గా నిలిచిన ఒక మూవీ తెలుగు వెర్షన్‌లో ఓటీటీలోకి వచ్చేసింది. ఇటీవల కన్నడలో విడదలై సూపర్‌హిట్ గా నిలిచిన చిత్రం హాస్టల్ హుదుగురు బెకగిద్దారే. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమా గా విడుదలైన ఈ మూవీ యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంది. జులై 21 న థియేటర్ల లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. దీంతో సరిగ్గా నెల తర్వాత ఇదే సినిమాను ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో తెలుగు లో కూడా విడుదల చేశారు.
ఒరిజనల్ వెర్షన్ లో రిషబ్ శెట్టి మరియు రమ్య పోషించిన పాత్రలను తెలుగులో తరుణ్ భాస్కర్ మరియు యాంకర్ రష్మీ గౌతమ్ పోషించడం విశేషం. దీంతో బాయ్స్ హాస్టల్ మూవీ కి మంచి టాక్ వచ్చింది. కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. థియేటర్ల లో యూత్ ను ఎంతగానో ఆకట్టుకున్న బాయ్స్ హాస్టల్ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఒరిజినల్ వెర్షన్ ఇప్పటికే ఓటీటీలో రాగా తెలుగు వెర్షన్ మాత్రం ఇప్పుడు అధికారికంగా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ లో శుక్రవారం (నవంబర్ 10) ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ స్ట్రీమింగ్ అవుతోంది.బాయ్స్ హాస్టల్ సినిమా కు నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. ఇక తెలుగు లో ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తం గా ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ను థియేటర్ల లో విడుదల చేశాయి. కాంతార మరియు విరూపాక్ష సినిమాలకు మ్యూజిక్ అందించిన అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమా కు మ్యూజిక్ అందించారు
Also Read
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!