NTV Telugu Site icon

Boy Complain against Mother: అమ్మపై ఫిర్యాదు.. నచ్చిన చొక్కా ఇవ్వలేదని టవల్‌తోనే పీఎస్‌కు బుడతడు..

Eluru

Eluru

Boy Complain against Mother: పిల్లలు దేనికి ఎలా రియాక్ట్ అవుతారే తెలియడం లేదు.. తమ్మ తనకు నచ్చిన చొక్కా ఇవ్వలేదంటూ పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కాడో బుడతడు.. పట్టుమని పదేళ్లు కూడా లేవు.. కానీ, పీఎస్‌కు వెళ్లి అమ్మపై ఫిర్యాదు చేశాడు.. స్నేహితుడి పుట్టిన రోజుకు వెళ్లాలి.. అందుకోసం తెల్ల చొక్కా అడిగాను.. అమ్మ ఇవ్వడం లేదంటూ పోలీసులకు తెలిపాడు.. అసలు బాలుడు.. ఆపై పీఎస్‌కు వచ్చి.. ఇలా అమ్మపై ఫిర్యాదు చేయడం కంగుతున్న పోలీసులు.. ఆ తర్వాత తేరుకుని.. అమ్మానాన్నలను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి మాట్లాడి.. ఇంటికి పంపారు పోలీసులు.

Read Also: MP Gurumurthy: పుష్ప-2 గెటప్‌లో వైసీపీ ఎంపీ

ఏలూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమ్మ చొక్కా ఇవ్వలేదని ఏలూరు టూ టౌన్‌ పోలీసులను ఆశ్రయించాడో బాలుడు.. చొక్కా లేకుండానే టవల్ కట్టుకుని నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడు.. తాను స్నేహితుడి పుట్టిన రోజు వేడుకకు వెళ్లాలి.. దాని కోసం తెల్ల చొక్కా అగిడితే అమ్మ ఇవ్వనంటోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. విషయం తెలుసుకున్న సీఐ చంద్రశేఖరరావు తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులు వచ్చి పోలీసులతో మాట్లాడిన.. ఆ బాలుడికి తీసుకొని ఇంటికి వెళ్లారు.. కానీ, చొక్కా కోసం పీఎస్‌కు వెళ్లిన ఈ బుడతడు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయాడు.. వరే ఏంటిరా ఇది? అని కొందరు సెటైర్లు వేస్తుంటే.. వీడు ఇప్పుడే ఇలా ఉన్నాడు.. పెద్దాయక పరిస్థితి ఏంటో అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.