వేడుకలను విషాదంగా మార్చేస్తోంది చైనా మాంజా. నైలాన్ లేదా సింథటిక్ పదార్థాలతో తయారై, గాజు పొడి పూత కలిగిన ఈ దారం పర్యావరణానికి , ప్రాణకోటికి పెను ముప్పుగా మారింది. ఈ నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం 2016లోనే చైనీస్ మాంజాపై పూర్తిస్థాయి నిషేధాన్ని విధించింది. దీనికి తోడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) కూడా 2017లో దేశవ్యాప్తంగా దీని వినియోగాన్ని నిషేధిస్తూ తీర్పునిచ్చింది. ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ చైనా మాంజా వాడకానికి అడ్డుకట్టపడడం లేదు. చైనా మాంజా కారణంగా పలువురు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
Also Read:Gold Rates: మగువలకు మళ్లీ షాక్.. నేడు బంగారం, వెండి ధరలు ఇలా..!
మరికొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలవుతున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. చైనా మాంజా మెడకు చుట్టుకుని బాలునికి తీవ్ర గాయాలు అయ్యాయి. పట్టణంలోని దుబ్బవాడలో ఇంటి ముందు ఆడుకుంటున్న శ్రీహాస్ (4) అనే బాలుడి మెడకు చైనా మాంజా చుట్టుకుంది. మెడ చుట్టు తీవ్రగాయలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. శ్రీహాస్ మెడ చుట్టూ 20 కుట్లు వేసి డాక్టర్లు చికిత్స చేశారు. ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.