Vizag: బీచ్‌లో దారుణం.. అర్ధరాత్రి ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Crime: మూడుముళ్ల బంధమైనా పెళ్లితో ఒక్కటవడానికి అంటే.., అక్రమ సంబంధాలంటే మోజు చూపుతున్నారు నేటి యువత. నిండు నూరేళ్లు సాగాల్సిన దాంపత్య జీవితం.. క్షణిక సుఖాలిచ్చే వివాహేతర సంబంధాలతో విచ్ఛిన్నమవుతోంది. పరాయివాళ్లపై వ్యామోహం పెంచుకొని పండంటి నూరేళ్ళ జీవితాన్ని ముళ్లదారిగా మార్చుకుంటున్నారు. భార్యాభర్తల మధ్య వచ్చే మనస్పర్థల సాకుతో వేరొకరితో శారీరక సుఖాలవైపు మళ్లుతున్నారు. అలాంటి ఘటనే ఒకటి విశాఖ పట్నంలో చోటుచేసుకుంది. నమ్మి వచ్చిన ప్రియురాలిని హత్య చేశాడు ఓ ప్రియుడు. త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్థరాత్రి ఈ దారుణం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలియగానే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ తరుణంలోనే గాజువాక పోలీస్ స్టేషన్లో నిందితుడు లొంగిపోయినట్టు సమాచారం.
Read Also: Fire accident: పాతబస్తీలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. 2 షాపుల్లో చలరేగిన మంటలు
Also Read
ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. కె శ్రావణి అనే వివాహితను హత్య చేశాడు పరవాడకు చెందిన గోపాలకృష్ణ అనే యువకుడు. అర్థరాత్రి మూడు గంటల సమయంలో బీచ్‌కు వచ్చారు శ్రావణి, గోపాలకృష్ణ. ఇరువురు మధ్య వాగ్వాదం జరగడంతో శ్రావణిని హత్య చేశాడు గోపాలకృష్ణ. జగదాంబలో ఓ షాపింగ్ మాల్లో పని చేస్తున్న శ్రావణిని గోపాలకృష్ణ ప్రేమిస్తున్నాడు. అయితే.. వీరి మధ్యం ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆ మహిళను గోపాలకృష్ణ హత్య చేశాడు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!