Site icon NTV Telugu

Vizag: బీచ్‌లో దారుణం.. అర్ధరాత్రి ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

Vizag

Vizag

Vizag Crime: మూడుముళ్ల బంధమైనా పెళ్లితో ఒక్కటవడానికి అంటే.., అక్రమ సంబంధాలంటే మోజు చూపుతున్నారు నేటి యువత. నిండు నూరేళ్లు సాగాల్సిన దాంపత్య జీవితం.. క్షణిక సుఖాలిచ్చే వివాహేతర సంబంధాలతో విచ్ఛిన్నమవుతోంది. పరాయివాళ్లపై వ్యామోహం పెంచుకొని పండంటి నూరేళ్ళ జీవితాన్ని ముళ్లదారిగా మార్చుకుంటున్నారు. భార్యాభర్తల మధ్య వచ్చే మనస్పర్థల సాకుతో వేరొకరితో శారీరక సుఖాలవైపు మళ్లుతున్నారు. అలాంటి ఘటనే ఒకటి విశాఖ పట్నంలో చోటుచేసుకుంది. నమ్మి వచ్చిన ప్రియురాలిని హత్య చేశాడు ఓ ప్రియుడు. త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్థరాత్రి ఈ దారుణం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలియగానే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ తరుణంలోనే గాజువాక పోలీస్ స్టేషన్‌లో నిందితుడు లొంగిపోయినట్టు సమాచారం.

Read Also: Fire accident: పాతబస్తీలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.. 2 షాపుల్లో చలరేగిన మంటలు

ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. కె శ్రావణి అనే వివాహితను హత్య చేశాడు పరవాడకు చెందిన గోపాలకృష్ణ అనే యువకుడు. అర్థరాత్రి మూడు గంటల సమయంలో బీచ్‌కు వచ్చారు శ్రావణి, గోపాలకృష్ణ. ఇరువురు మధ్య వాగ్వాదం జరగడంతో శ్రావణిని హత్య చేశాడు గోపాలకృష్ణ. జగదాంబలో ఓ షాపింగ్ మాల్‌లో పని చేస్తున్న శ్రావణిని గోపాలకృష్ణ ప్రేమిస్తున్నాడు. అయితే.. వీరి మధ్యం ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆ మహిళను గోపాలకృష్ణ హత్య చేశాడు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version