‘భీష్మ’ లాంటి కూల్ ఫన్ ఎంటర్టైనర్ సినిమాని తెలుగు ఆడియన్స్ కి ఇచ్చిన వెంకీ కుడుముల, నితిన్ కలిసి సెకండ్ కాలాబోరేషన్ కి రెడీ అయ్యారు. #VN2 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ “అన్ మాస్కింగ్ ది కాన్ మాన్” అంటూ రిపబ్లిక్ డే సంధర్భంగా… జనవరి 26న ఉదయం 11:07 నిమిషాలకి ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు నిమిషమున్నర నిడివి ఉన్న గ్లింప్స్ కూడా రిలీజ్ చేసారు మేకర్స్.
నితిన్ వాయిస్ ఓవర్ తో… “డబ్బు చాలా చెడ్డది. రూపాయి రూపాయి నువ్వు ఏం చేస్తావ్ అంటే అన్నదమ్ములని విడదీస్తాను అని చెప్పిందంట. అన్నంత పనీ చేసింది, అన్నదమ్ములని విడదీసింది. నా వాళ్లే కదా అని జేబులో చేతులు పెట్టి డబ్బులు తీసుకుంటే నన్ను దొంగ అని నాపై కేసులు పెట్టారు. అయినా నేను బాధపడను ఎందుకంటే ఇండియా ఈజ్ మై కంట్రీ… ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్” అనే డైలాగ్ తో హీరో క్యారెక్టర్ ని చెప్పేసాడు వెంకీ కుడుములు.
రాబిన్ హుడ్ అనే టైటిల్ ని రివీల్ చేసి… క్యారెక్టర్ ని జస్టీఫై చేసారు. కిక్ సినిమాలో రవితేజ క్యారెక్టర్ కి, రాబిన్ హుడ్ లో నితిన్ పాత్రకి కాస్త దగ్గర పోలికలు ఉన్నాయి. గ్లింప్స్ తో కొత్త క్యారెక్టర్ తో కథ చెప్పబోతున్నా అని చెప్పేసిన వెంకీ కుడుముల… నితిన్ తో సెకండ్ హిట్ కొట్టేలాగే ఉన్నాడు. గ్లింప్స్ కి జీవీ ప్రకాష్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఈ మధ్య కాలంలో నితిన్ ఇంత వైరైటీ క్యారెక్టర్ ని అయితే ప్లే చేయలేదు. సినిమాని కేర్ ఫుల్ గా తెరకెక్కిస్తే #VN మరోసారి హిట్ కొట్టినట్లే.
Unmasking the Con Man from the most entertaining & adventurous world 💥💥
Say hello to your new family member – #ROBINHOOD ❤️🔥
Title reveal glimpse out now!
– https://t.co/BoPSPtzMT4#IdhiVere #VN2 @actor_nithiin @VenkyKudumula @gvprakash pic.twitter.com/liAOgVVKwD— Mythri Movie Makers (@MythriOfficial) January 26, 2024