NTV Telugu Site icon

Botsa Satyanarayana: అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి చేసుకొచ్చాం.. నష్టపడినా, లాభపడినా ప్రజానీకమే..!

Botsa

Botsa

Botsa Satyanarayana: ఎన్నికలు ముగిశాయి.. అందరూ చాలా కష్టబడ్డారని.. మా ఓటమిని అంగీకరిస్తున్నామని తాజా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి చేసుకొచ్చామని.. అయితే మరి కొన్ని మిగిలి ఉన్నాయని, వాటిని కొనసాగించాలని మా అభిప్రాయాన్ని చెబుతున్నామన్నారు. మెడికల్ కాలేజీలూ, రోడ్లు, ఇంటింటికీ తాగునీరు ఇలా అన్ని కార్యక్రామాలు పూర్తి చేస్తారని ఆశిస్తున్నామన్నారు. ఎలాంటి అవినీతి లేని పాలన అందించామని.. దానిని కొనసాగిస్తారని కోరుకుంటున్నామన్నారు. ఏం జరిగినా నష్టం లాభాలు ప్రజలకేనన్నారు. ఐదేళ్లు సేవ చేసే అవకాశాన్ని ఇచ్చిన ప్రజానీకానికి ధన్యవాదాలు తెలిపారు. మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు.

Read Also: YS Jagan: రక్షణ లేకుండా పోయింది.. గవర్నర్‌ గారు వెంటనే జోక్యం చేసుకొండి..!

మేము ఇచ్చిన దానికంటే ఎక్కువ కోరుకొని ఉండొచ్చని.. సమయం వచ్చినప్పుడు స్పందిస్తామన్నారు. తలసరి ఆదాయాన్ని పెంచామని.. ఇంత కంటే ఎక్కువ కావాలని కోరుకుంటున్నారేమోనని బొత్స పేర్కొన్నారు. ప్రజలకు మేలు జరగాలని.. జీవనం మెరుగుపడాలనే కోరుకుంటున్నామన్నారు. ఏదేమైనా ఓటు వేసి తీర్పు ఇచ్చిన వారు ప్రజలేనని బొత్స తెలిపారు. రాజకీయాలలో ఉదయమైతే, రాత్రి అవుతోందన్నారు. మేము ప్రజలను నమ్మామని.. మా విధానాలను విశ్వసించామని.. వారు ఇంతకంటే మెరుగైనవి కోరుకున్నారో చూడాలన్నారు. జిల్లాకి ఒక మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని.. ఆంగ్ల మాధ్యమంలో బోధనను తీసుకువచ్చామన్నారు. పార్టీని నమ్మి కార్యకర్త చాలా శ్రమించారని.. వారందరికీ ధన్యవాదాలు అని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఇలాగే పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి పనిచెయ్యాలన్నారు.

Read Also: G. Kishan Reddy: తెలంగాణ ప్రజలకు గుండె చప్పుడై బీజేపీ పనిచేస్తుంది..

జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ తీసుకొచ్చామని, పార్వతీపురంలో పెట్టాలనుకున్నామని.. మరి ఇంతకంటే ఎక్కువ తీసుకొస్తారేమోనన్నారు. ఇప్పుడే ఎందుకు విమర్శించాలి.. కొన్ని రోజులు చూద్దామన్నారు. మేము సరిచేయకపోతే వాళ్లు అధికారంలోకి వచ్చారు కదా వాటిని సరి చెయ్యాలన్నారు. ప్రాంతీయ పార్టీలు గెలిచిన ఓడినా పార్టీ పెద్దే… అయితే జగన్ ఓడిపోయాడని అనకూడదన్నారు. పైనా విషయంలో చాలా క్లారిటీగా అసెంబ్లీలో చెప్పామన్నారు. మెగా డీఎస్సీ ఇరవై వేలతో అన్నారు ప్రకటించమనండి.. మంచిదేనంటూ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఓపీఎస్ ఇస్తామన్నారు ఇవ్వమనండి తప్పేమీ లేదన్నారు. మేము ఇవ్వలేకపోయామని.. ఇవ్వమనండి అంటూ పేర్కొన్నారు. సచివాలయాలు, రైతులకు ఊర్లలోనే విత్తనాలను ఇచ్చామని బొత్స సత్యనారాయణ వెల్లడించారు.