NTV Telugu Site icon

Botsa Satyanarayana : చంద్రబాబు పాలన అంతా కరువు, కాటకాలే

Botsa Satyanarayana

Botsa Satyanarayana

టీడీపీ మహానాడులో నేడు తొలిరోజు రాజమండ్రి వేదికగా తెలుగుదేశం పార్టీ భారీ సభను ఏర్పాటు చేసింది. అయితే.. ఈ సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. వ్యవసాయం శుద్ధ దండగ అని చెప్పింది.. రైతుల ఆత్మహత్యలు జరిగింది చంద్రబాబు హయాంలోనేనని ఆయన అన్నారు. అంతేకాకుండా.. చంద్రబాబు పాలన అంతా కరువు, కాటకాలే అని, రైతుకు భరోసా కల్పించి వ్యవసాయం వైపు నడిపించింది వైసీపీ ప్రభుత్వమన్నారు మంత్రి బొత్స. రాష్ట్ర అభివృద్ధి సూచీ టీడీపీ కంటే ఎక్కువ ఉందనే గణాంకాలు నిజమా….? కాదా….?. చంద్రబాబు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Asia Cup 2023: పాకిస్తాన్‌కు షాక్.. అలాంటి ప్రతిపాదన ఏం లేదన్న బీసీసీఐ..
రాజమండ్రిలో మహా డ్రామా జరుగుతుందని, ఎన్టీఆర్ చావుకు చంద్రబాబు కారణమని, ఎన్టీఆర్ ఆత్మ క్షోబించడానికి కారణం చంద్రబాబు అని ఆరోపించారు. మళ్లీ ఆయన ఫోటోకు చంద్రబాబు దండ వేస్తున్నారని, చంద్రబాబుకు చెప్పుకోనేందుకు ఒక పథకమైన ఉందా అని మంత్రి ప్రశ్నించారు. బాబు హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదా?, వ్యవసాయం దండగని చెప్పింది చంద్రబాబు కాదా అని మంత్రి అన్నారు. చంద్రబాబు హయాంలో 22 స్థానంలో ఉన్న జీడీపీ నేడు మొదట స్థానంలో లేదా అని మంత్రి ప్రశ్నించారు. విద్య, వైద్యం, వ్యవసాయం సంక్షేమంకు సీఎం జగన్ పెద్ద పీట వేశారని, వాస్తవాలు ప్రజలకు తెలుసని మంత్రి బొత్స అన్నారు. అధికారం ఇచ్చిన ఐదేళ్లు చంద్రబాబు దోచుకుతిన్నారని, చంద్రబాబు సామాజిక వర్గానికి దోచిపెట్టారని మంత్రి ఆరోపించారు.

Sanjay Raut: బీజేపీ మొసలి, కొండ చిలువ.. వారితో వెళ్తే అంతే సంగతులు..