Botsa Satyanarayana: డీఎస్సీపై చర్చకు ఎందుకు రాలేదు?: సవాళ్లు మాత్రం విసురుతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. శాసనమండలి మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. గత నాలుగు రోజులుగా డీఎస్సీ అంశంపై ప్రభుత్వం చర్చకు రాలేదని ఆరోపించారు. డీఎస్సీలో అవకతవకలు జరిగాయనే అనుమానాలపై విచారణ జరిపించాలని తాము కోరినట్లు తెలిపారు. ఉద్యోగాలను మార్కెట్లో వస్తువుల్లా అమ్ముకున్నారని బొత్స తీవ్ర ఆరోపణలు చేశారు. డీఎస్సీతో పాటు గ్రూప్-1 నియామకాలపైనా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సభలో చెప్పారని గుర్తుచేశారు. అందుకే ప్రభుత్వం ఈ అంశంపై చర్చకు వెనుకడుగు వేస్తోందని విమర్శించారు.
గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల కల్పన
తమ ప్రభుత్వ హయాంలో పలు డీఎస్సీల ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని బొత్స తెలిపారు. 1998 డీఎస్సీలో 5,887 మందికి, 2008 డీఎస్సీలో 2,193 మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. 2019లో ప్రత్యేక డీఎస్సీ నిర్వహించి 521 మందికి ఉద్యోగాలు ఇచ్చామని, 1,250 మంది కేజీబీవీ టీచర్లకు కూడా ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు జరిగాయా అని ప్రశ్నించారు. ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోందని, వాస్తవ పరిస్థితులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
- YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
- Supreme Court: X, ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
రెండేళ్లలోనే ప్రభుత్వంపై ప్రజలకు అవగాహన
ప్రస్తుత ప్రభుత్వానికి రెండేళ్లలోనే ప్రజలు అర్థం చేసుకున్నారని బొత్స వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తరచూ సవాళ్లు విసురుతోందని, అయితే చర్చకు రావాలని కోరితే వెనుకడుగు వేస్తోందని విమర్శించారు. ప్రజా సమస్యలపై తమకు చిత్తశుద్ధి ఉందని, అందుకే వాటిపై సభలో చర్చించాలని కోరుతున్నామని చెప్పారు. ప్రభుత్వం ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూస్తోందని ఆరోపించారు. ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
విద్యావ్యవస్థపై బొత్స విమర్శలు
రాష్ట్రంలో రెండేళ్లలోనే లక్ష మంది విద్యార్థులు ఎందుకు తగ్గారని బొత్స ప్రశ్నించారు. విద్యావ్యవస్థలో లోపాలు ఉండటం వల్లే విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల వైపు తరలిపోయారని ఆరోపించారు. త ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థను బలోపేతం చేశామని, ‘నాడు-నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చామని తెలిపారు. ఐబీ వంటి సిలబస్‌లను ప్రవేశపెట్టి విద్యా ప్రమాణాలను పెంచామని అన్నారు. ‘గోరుముద్ద’, మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందించామని, ‘అమ్మ ఒడి’ పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేశామని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం పథకాల పేర్లు మార్చడమే కాకుండా బకాయిలు పెడుతోందని ఆరోపించారు. విద్యావ్యవస్థను ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని విమర్శించారు. ఇంగ్లీష్ మీడియాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు.
గంజాయి వ్యవహారంపైనా విమర్శలు
అద్దంకిలో గంజాయి తరలిస్తూ ఇద్దరు పోలీసులు పట్టుబడ్డారనే అంశాన్ని కూడా బొత్స ప్రస్తావించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గంజాయి కేసుల్లో చిన్న ప్యాకెట్‌తో పట్టుబడిన వారిని అరెస్ట్ చేసి హడావుడి చేస్తున్న ప్రభుత్వం.. పోలీసుల వద్ద గంజాయి పట్టుబడితే ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో గంజాయి సమస్యపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించాలని కోరారు.
అమరావతిపై కూడా విమర్శలు
అమరావతిలో పెద్దగా అభివృద్ధి కనిపించడం లేదని బొత్స విమర్శించారు. ఐదేళ్ల క్రితం వేసిన చిన్న నిర్మాణ పనులను పూర్తి చేసి భారీగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. అమరావతి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏటీఎం కార్డులా మారిందని వ్యాఖ్యానించారు. మొత్తంగా డీఎస్సీ, గ్రూప్-1 నియామకాలపై విచారణ జరిపించాలని, ప్రజా సమస్యలపై ప్రభుత్వం సమగ్ర చర్చకు రావాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!