AUS vs IND: ఆస్ట్రేలియా పెద్ద ప్లానింగే.. బుమ్రాను టార్గెట్ చేసిందిగా!
- న్యూజిలాండ్ చేతిలో 3-0తో ఘోర పరాభవం
- కనీసం నాలుగింటిలో విజయం సాధించాలి
- బుమ్రాను టార్గెట్ చేసిన ఆస్ట్రేలియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 3-0తో ఘోర పరాభవం చవిచూసిన టీమిండియా.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసులో వెనకపడిపోయింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోవాలంటే ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో సిరీస్ విజయంతో పాటు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకూడదు. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల్లో కనీసం నాలుగింటిలో విజయం సాధించాలంటే.. న్యూజిలాండ్ సిరీస్‌లో పేలవ ప్రదర్శన చేసిన రోహిత్ సేన గొప్పగా పుంజుకోవాల్సి ఉంది. సిరీస్ గెలవాలంటే సీనియర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గాడిలో పడాల్సిన అవసరం ఎంతో ఉంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అందరి దృష్టి స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపైనే ఉంది. ఎందుకంటే ఆస్ట్రేలియాలో భారత్ గత రెండు సిరీస్‌లను గెలవడంలో అతడిది కీలక పాత్ర. ఆస్ట్రేలియాలో 7 టెస్టులు ఆడిన బుమ్రా.. ఏకంగా 32 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒకసారి ఐదు వికెట్ల ప్రదర్శన ఉంది. 2018లో బెస్ట్ బౌలింగ్ గణాంకాలను (6/33) నమోదు చేశాడు. అందుకే బుమ్రాను కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా ఓ మాస్టర్ ప్లాన్ వేసినట్లు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ తెలిపాడు. టీమిండియాలో బుమ్రా మినహా మిగతా పేసర్ల పరిస్థితి అంతర్జాతీయ స్థాయిలో లేకపోవడం ఇబ్బందికరమే అన్నాడు. సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఉండుంటే.. భారత జట్టును అడ్డుకోవడం ఆసీస్‌కు కష్టంగా ఉండేదని అభిప్రాయపడ్డాడు.
Also Read
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
Also Read: Border Gavaskar Trophy: ఆమె కాళ్లు మొక్కి ఫ్లైట్ ఎక్కిన పంత్.. వీడియో వైరల్!
జియో సినిమాలో సైమన్ డౌల్ మాట్లాడుతూ… ‘ఆస్ట్రేలియా షెడ్యూలింగ్‌లోనే స్మార్ట్‌గా వ్యవహరించినట్లు అనిపిస్తోంది. తమ బ్యాటింగ్ పైనా స్పష్టత మాత్రమే కాదు.. టీమిండియా బ్యాటర్ల గురించి వారికి పూర్తి అవగాహన ఉంది. అయితే ఆస్ట్రేలియాకు జస్ప్రీత్ బుమ్రా నుంచి అతి పెద్ద ముప్పు ఉంది. అందుకే మూడు పిచ్‌లను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పెర్త్‌లో వేడి దెబ్బకు బుమ్రా ఉడికిపోయేలా ప్రణాళికలను రూపొందించినట్లు ఉంది. భారత జట్టులో అతడే ఎక్కువ ఓవర్లు వేయాల్సి ఉంటుంది. కానీ పెర్త్ పరిస్థితులు అందుకు పెద్దగా సహకరించవు. మిగతా బౌలర్ల నుంచి సహకారం లేకపోతే బుమ్రా పైనే ఎక్కువ భారం పడుతుంది. అడిలైడ్, బ్రిస్బేన్‌లో కూడా పేస్ బౌలర్లకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అక్కడ కూడా బుమ్రానే ఎక్కువ ఓవర్లు వేయాల్సి ఉంటుంది. మహమ్మద్ షమీ లేకపోవడం భారత జట్టుకు తీవ్ర నష్టం’ అని అన్నాడు.
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..