Boora Narsaiah Goud on Bengal CM Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తెలంగాణ బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ ఫైర్ అయ్యారు. 75 శాతం బీసీలను మమత వెన్ను పోటు పొడిచారని, కాంగ్రెస్‌లో ఉన్న హిందువులంధరు ఆమెపై వ్యతిరేకతతో ఉన్నారన్నారు. జూన్ 4 తరువాత బెంగాల్లోనే కాదు దేశంలోనే పెను మార్పులు సంభవిస్థాయన్నారు. 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని రాహూల్ గాంధీ కూటమి తప్పుడు ప్రచారం చేస్తోందని, మహమ్మద్ గజిని చెయ్యలేని దారుణమైన దండయాత్రలు దేశ రిజర్వేషన్లపై చేస్తున్నారని విమర్శించారు. ముస్లిం వర్గాలను ఓబీసీ కోటలో చేర్చడం రాజ్యాంగ విరుద్ధం అని బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు.
భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ… ‘రాజ్యాంగం ప్రకారం మతాలకతీతంగా అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పించారు. 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని రాహూల్ కూటమి తప్పుడు ప్రచారం చేస్తోంది. మహమ్మద్ గజిని చెయ్యలేని దారుణమైన దండయాత్రలు దేశ రిజర్వేషన్లపై వీరు చేస్తున్నారు. ముస్లిం వర్గాలను ఓబీసీ కోటలో చేర్చడం రాజ్యాంగ విరుద్ధం. బంగ్లాదేశ్ రోహింగ్యాలను ఓబీసీలో చేర్చడం దుర్మార్గమైన చర్య. హిందూ వ్యతిరేక కుట్రలో భాగంగానే ముస్లిం రిజర్వేషన్లు మమతా బెనర్జీ ప్రోత్సహిస్తున్నారు. ఓబీసీ కోటలో ఉన్న ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసిన బెంగాల్ హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. బెంగాల్ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాహుల్ టీమ్‌కు చెంపపెట్టు లాంటిది’ అని అన్నారు.
Also Read: Cannes Film Festival 2024: కేన్స్‌లో భారతీయ చిత్రం ప్రదర్శన.. మూవీ టీమ్‌కు స్టాండింగ్ ఒవేషన్!
‘రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యతిరేక విధానాలతో మమతా బెనర్జీ వెళ్తున్నారు. బెంగాల్‌లో ఉద్యోగాల కోసం హిందువులు మతమార్పిడి చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. హైకోర్టు తీర్పును మమత ధిక్కారిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాకు ఆమెను అనర్హురాలిగా ప్రకటించాలి. 75 శాతం బీసీలను మమతా బెనర్జీ వెన్ను పోటు పొడిచారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులంధరు మమతాపై వ్యతిరేకతతో ఉన్నారు. జూన్ 4 తరువాత బెంగాల్లోనే కాదు దేశంలోనే పెను మార్పులు సంభవిస్థాయి. అధికారంలోకి రాక ముందు ఓబీసీల కులఘణన చేసి ఓబీసీలకు ఇస్తామన్న 42 శాతం రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలి. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలకు చిత్తశుద్ధి ఉంటే ఓబీసీలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చెయ్యాలి. కులగణన లేకుండా స్థానిక ఎన్నికలకు వెళ్తే సహించేది లేదు. మిలియన్ మార్చ్ తరహాలో పోరాటానికి సిద్దమవుతాం’ అని బూర నర్సయ్య గౌడ్ హెచ్చరించారు.