బీసీ గోస పోస్టర్‌ను బీజేపీ బీసీ నేతలు అవిష్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్ బీసీల మీద కక్ష పెంచుకున్నాడని ఆరోపించారు. అయన డీఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉందని, కేసీఆర్ బీసీలను అష్ట దిగ్బంధనం చేస్తున్నారన్నారు. తెలంగాణలో 15 లక్షల బీసీ కుటుంబాలు అత్యంత పేదరికంలో ఉన్నాయని, బీజేపీ ఓబీసీ సమ్మేళనానికి భయపడి కేసీఆర్ బీసీలకు లక్ష భిక్ష అనే పథకం పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. 10వేల కోట్లు కావాలి… అయన కేటాయించింది కేవలం వంద కోట్లు మాత్రమే ఇచ్చారని ఆయన మండిపడ్డారు.
Also Read : Liquor Shops Closed: మద్యం ప్రియులకు షాక్.. రెండ్రోజుల పాటు వైన్ షాప్స్ బంద్
ఈ లక్ష భిక్ష ప్రోగ్రాం పూర్తి కావాలి అంటే వంద యేళ్లు కావాలని, ముగ్గురు బీసీ మంత్రులు కేసీఆర్ కోతులు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. మిగతా మంత్రుల కన్నా కేసీఆర్‌కు వీళ్ళే ముందు డబ్బా కొడతారని, వీళ్లకు చీము రక్తం లేదంటూ ఆయన ధ్వజమెత్తారు. పేదోడు పేదోడే… ఒకరికి పది లక్షలు మరొకరు కు లక్ష ఏంది ఇది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు… మరి బీసీ ఓట్లు కూడా బీజేపీ కే పడతాయని, వెంటనే అసెంబ్లీ సెషన్ పెట్టీ బీసీ సబ్ ప్లాన్ కి చట్టబద్దత కల్పించాలని, వచ్చే ఎన్నికల్లో బీసీ లు ప్రతీకారం తీసుకుంటారన్నారు.
Also Read : Big Breaking: నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3
