NTV Telugu Site icon

Mechanic Rocky : పెయిడ్ ప్రీమియర్స్ ఉన్నాయ్.. మెకానిక్ రాకీ పై అదంతా ఉత్తిదే

Mechanic Rocky

Mechanic Rocky

Mechanic Rocky : మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన్ మోస్ట్ అవైటెడ్ సినిమా ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ పై రామ్ తాళ్లూరి నిర్మించారు. సినిమాకు కొత్త డైరెక్టర్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక మెకానిక్ రాకీ చిత్రం నవంబర్ 22న విడుదల కానుండగా.. వరంగర్ లో ‘మెకానిక్ రాకీ’ ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. పట్టణంలో భారీగా హాజరైన సినీ అభిమానుల సమక్షంలో ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ 2.0 ను లాంచ్ చేశారు.

Read Also:AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక అంశాలపై ఫోకస్‌

ఈ ఫ్రైడే ఏకంగా ఆరు సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో మూడు కొంత బజ్ క్రియేట్ చేశాయి. ఆ మూడింట్లో ఎక్కువ అంచనాలున్నది ‘మెకానిక్ రాకీ’ మీదే. జీబ్రా, దేవకీ నందన వాసుదేవ కూడా కొంతమేర సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విశ్వక్ సేన్ సినిమా అంటే సోషల్ మీడియాలో మంచి హైపే వస్తుంది. తన సినిమా గురించి ఏదో ఒకటి సెన్సేషనల్‌గా మాట్లాడి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటాడు విశ్వక్. ‘మెకానిక్ రాకీ’ గురించి ముందు జనాలకు పెద్దగా తెలియలేదు కానీ.. ట్రైలర్ లాంచ్ టైంలో విశ్వక్ తన కొత్త సినిమా గురించి చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడి బజ్ క్రియేట్ చేశాడు. సినిమా 22న రిలీజ్ అవుతుండగా.. ముందు రోజే పెయిడ్ ప్రిమియర్స్ వేస్తున్నామని.. ఆ రోజు సినిమా చూసి ఎవరైనా బాలేదంటే తర్వాతి రోజు థియేటర్లకు వెళ్లొద్దంటూ చెప్పుకొచ్చాడు.

Read Also:Group-1: నేడు గ్రూప్-1 పై హైకోర్టులో విచారణ.. అభ్యర్థుల్లో ఉత్కంఠ!

విశ్వక్ సేన్ కాన్ఫిడెన్స్ చూస్తే సినిమాలో చాలా బలమైన కంటెంట్ ఉంటుందనే అనుకున్నారు. విశ్వక్ ఫ్యాన్స్‌తో పాటు మూమూలు ప్రేక్షకులు కూడా పెయిడ్ ప్రీమియర్స్ కోసం ఎందురు చూశారు. సినిమా మీద బలమైన నమ్మకం ఉన్నపుడు ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్ వేయడం ఇప్పుడు ట్రెండ్ గా మారింది. ఇది కొన్ని సినిమాలకు కలిసొచ్చింది. అలాగే బాలేని సినిమాలకు అది మైనస్ కూడా అయితే. ఐతే ‘మెకానిక్ రాకీ’కి పెయిడ్ ప్రిమియర్స్ పడతాయని కొన్ని వారాల ముందే ధీమాగా ప్రకటించిన విశ్వక్.. ఇప్పుడు ఆ మాట ఎత్తడం లేదని కొంతమంది అనుకుంటున్నారు. ఈ సినిమాకు ఆల్రెడీ బుకింగ్స్ షురూ అవ్వగా.. ఇప్పుడు పెయిర్ ప్రీమియర్స్ లేవన్న వారి అనుమానాలను పటాపంచలు చేస్తే చిత్ర యూనిట్ పెయిడ్ ప్రీమియర్స్ కు బుకింగ్స్ స్టార్ట్ చేసింది. దీంతో ఈ సినిమా పై వదంతులు సృష్టించిన వాళ్ల నోర్లు మూయించినట్లు అయింది.

Show comments