NTV Telugu Site icon

Boney Kapoor : ఛీ..ఛీ ఈ వయసులో ఇదేం బుద్ధి.. శ్రీదేవీ భర్తపై నెటిజన్ల ఫైర్

Bony Kapoor

Bony Kapoor

Boney Kapoor : బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీకపూర్ ఓ సెలబ్రిటీతో దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటో ఆయన చేసిన పనిపై శ్రీదేవి అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇటీవల రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, తన భార్య నీతా అంబానీలు సంప్రదాయ కళలను ప్రోత్సహించడానికి నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఎంతోమంది సినీ రాజకీయ క్రీడ రంగానికి చెందినటువంటి ప్రముఖులు ప్రముఖ వ్యాపారవేత్తలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బోని కపూర్ కూడా సందడి చేశారు.

Read Also:Nani: బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ అనే తేడా లేకుండా అందరినీ ఉతికారేసాడు

ఈ క్రమంలోనే హాలీవుడ్ మోడల్ గిగి హడిద్ కనిపించగానే బోనీకపూర్ ఆమెతో ఫోటో దిగాడు. ఫోటో దిగడం తప్పులేదు.. కానీ ఆ ఫోటో చూసిన ప్రజలు బోనీకపూర్ ని ట్రోల్ చేస్తున్నారు. ఈ వయసులో ఇలాంటి ఫోజుల అవసరమా అంటూ మండిపడుతున్నారు . ఆయన ఆ ఫోటోలో మోడల్ జిగి నడుము పై చేయి వేసి గట్టిగా లాగిపెట్టి నొక్కి పెట్టారు . ఈ క్రమంలోనే బోనీకాపూర్ పై మండిపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు త్వరలోనే మూడో పెళ్లి చేసుకుంటారు ఏమో అన్న కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే పెళ్లికి ఎదిగిన ఇద్దరు కూతుర్ల ఇంట్లో ఉండగా నీలో ఈ రొమాంటిక్ యాంగిల్ ఏందిరా బాబు అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

Boney Kapoor :Forbes Billionaires List 2023: ఆసియాలో ధనవంతుడు ముఖేష్ అంబానీ.. మరి ప్రపంచంలో..

Show comments