Fake Call : స్కూళ్లో బాంబ్ పెట్టాం.. ఏ క్షణంలోనైనా పేలొచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Call : ఢిల్లీలో ఓ స్కూల్ పేరు మీద మొయిల్తో రావడంతో అధికారులంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. హడావుడిగా ఎక్కడికక్కడా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఏ చిన్న ప్రాంతాన్ని వదలకుండా అణువణువు తనిఖీ చేసి ఏం లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే.. ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ ప్రాంతంలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. ఇ-మెయిల్ ద్వారా మీ స్కూళ్లో బాంబు పెట్టాం ఏ క్షణంలోనైనా పేల్చేస్తామని అందులో ఉంది. బాంబు బెదిరింపులు రావడంతో భయాందోళనకు గురైన స్కూల్ యాజమాన్యం పాఠశాలను ఖాళీ చేయించింది. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించింది.
Read Also: Work 4Days a Week : ఉద్యోగుల పంటపండింది.. ఇక వారానికి 4రోజులే పని
Also Read
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్‌తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్‌పై WHO షాకింగ్ నివేదిక..
- KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
దీంతో అప్రమత్తమైన అధికారులు పాఠశాలలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఆ స్కూల్లో ప్రతిమూల వెతికి ఎలాంటి బాంబును దొరక్క పోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఇదంతా ఆకతాయిల పనిగా పోలీసులు భావిస్తున్నారు. బీఆర్టీ మార్గ్‌లోని సాదిక్ నగర్లో ఉన్న పాఠశాల అధికారిక ఈ-మెయిల్ ఐడీకి పాఠశాల ఆవరణలో బాంబు పెట్టినట్లు మధ్యాహ్నం 1.19 గంటలకు మెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో స్కూల్ యాజమాన్యం స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే విద్యార్థులను ఖాళీ చేయించారు. సైబర్ బృందం ఇ-మెయిల్ చెక్ చేసిందని, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పాటు డిఫెన్స్ కాలనీ పోలీస్ స్టేషన్ నుంచి బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని బాంబు కోసం గాలించాయి. ఎలాంటి బాంబు దొరక్క పోవడంతో ఆకతాయిల పనై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు ప్రకటించారు.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్‌తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!