NTV Telugu Site icon

DELHI: ఎయిర్ కెనడా విమానానికి బాంబు బెదిరింపు.. కట్ చేస్తే..

New Project (38)

New Project (38)

గత కొన్ని రోజులుగా విమానాలకు బాంబు బెదిరింపు హెచ్చరికలు పెరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో టొరంటో వెళ్తున్న విమానంలో బాంబు ఉందని ఈమెయిల్ రావడంతో తీవ్ర భయాందోళన నెలకొంది. టొరంటోకు వెళ్లే ఎయిర్ కెనడా విమానంలో బాంబు ఉందని ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌కు ఇమెయిల్ వచ్చిందని అధికారులు తెలిపారు. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL) కార్యాలయానికి మంగళవారం రాత్రి 10.50 గంటలకు ఢిల్లీ-టొరంటో ఎయిర్ కెనడా విమానంలో బాంబు పెట్టినట్లు ఒక ఇమెయిల్ వచ్చిందని అధికారులు తెలిపారు. సెక్యూరిటీ ప్రోటోకాల్‌లను అనుసరించి.. సమగ్ర దర్యాప్తు, గాలింపు చేపట్టగా.. అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ విషయంలో తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

READ MORE: Lok Sabha Elections2024: జైలులో ఉండి ఎంపీలుగా విజయం.. ప్రమాణ స్వీకారం పరిస్థితేంటి?

భద్రతా హెచ్చరికలు లేదా బెదిరింపుల కారణంగా గత కొన్ని రోజులుగా వివిధ విమానయాన సంస్థలకు చెందిన అనేక విమానాలను అత్యవసర ల్యాండింగ్‌లు చేశారు. నాలుగు రోజుల కిందట ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న ఆకాస ఎయిర్ కు చెందిన విమానానికి సెక్యూరిటీ హెచ్చరిక రావడంతో అహ్మదాబాద్‌కు మళ్లించారు. విమానంలో ఒక చిన్నారి సహా 186 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. అహ్మదాబాద్‌కు మళ్లించిన తర్వాత, విమానం ఉదయం 10.13 గంటలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయబడింది. ప్రయాణికులందరినీ విమానాశ్రయంలోకి తరలించారు. “కెప్టెన్ అవసరమైన అన్ని అత్యవసర విధానాలను అనుసరించాడు. విమానాశ్రయంలో ల్యాండింగ్ చేసాడు. ఆకాస ఎయిర్ గ్రౌండ్‌లోని అన్ని భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరిస్తోంది.” అని ఆకాస ఎయిర్ ప్రతినిధి అన్నారు.