NTV Telugu Site icon

Bomb Threat: మూడు విమానాలకు బెదిరింపు కాల్‌.. సీఐఎస్‌ఎఫ్ అప్రమత్తం

Shamshabad Airport

Shamshabad Airport

Bomb Threat: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోని మూడు విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. హైదరాబాద్ నుండి చెన్నై వెళ్లాల్సిన రెండు ఇండిగో విమానాలు, చెన్నై నుండి హైదరాబాద్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో సీఐఎస్‌ఎఫ్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. మూడు విమానాల్లో సీఐఎస్‌ఎఫ్ సెక్యూరిటీ అధికారులు తనిఖీలు చేశారు. వారం పదిరోజులుగా పలు విమానాలకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.

Read Also: Rahul Gandi : రైల్వే వ్యవస్థ దెబ్బతింటోంది.. ప్రయాణికుల మాట వినేవారు లేరు : రాహుల్ గాంధీ

ఈ బాంబుల బెదిరింపుల బెడద ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైంది. దీనిపై కేంద్రం దృష్టి సారించింది. ఈ బాంబు బెదిరింపులపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు స్పందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ వస్తున్న బాంబు బెదిరింపులపైఫేక్‌ కాల్స్‌ లేదంటే ఉగ్రకోణం ఉందా? అనే దిశగా విచారణ చేపడుతున్నామని కేంద్రమంత్రి వెల్లడించిన విషయం విదితమే.