Site icon NTV Telugu

Praja Bhavan: ప్రజా భవన్కు బాంబు బెదిరింపు.. పోలీసుల విస్తృత తనిఖీలు

Praja Bhavan

Praja Bhavan

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కుటుంబం నివాసం ఉంటున్న ప్రజా భవన్లో బాంబు ఉన్నట్లు అజ్ఞాత వ్యక్తి 100కు డయల్ చేసి చెప్పడంతో రాష్ట్ర పోలీస్ శాఖ వెంటనే అప్రమత్తమయింది. ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ పోలీస్ అధికారులను రంగంలోకి దింపింది. హుటాహుటిన బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ప్రజాభవన్కు చేరుకొని అడుగడుగున తనిఖీలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పంజాగుట్ట ఏసీపీ మనోహర్ కుమార్ హుటాహుటిన సంఘటన స్థలానికి తన సిబ్బందితో చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

Read Also: ACB Raids: తెలంగాణ వ్యాప్తంగా రవాణాశాఖపై ఏసీబీ మెరుపు దాడులు..

ప్రజాభవన్ ఎంట్రన్స్ నుంచి నివాసం లోపల ఉన్న అన్ని గదులను, బెడ్రూమ్స్, కిచెన్, డైనింగ్ హాల్, విజిటర్ హాల్స్, ఉప ముఖ్యమంత్రి ఛాంబర్, జిమ్, గార్డెన్, పరిసర ప్రాంతాలను అణువణువునా డాగ్ స్క్వాడ్ బృందం పోలీసులు తనిఖీలు చేశారు. అదేవిధంగా భట్టి విక్రమార్క కాన్వాయ్, కుటుంబ సభ్యులు వాడుతున్న వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ తర్వాత ప్రజాభవన్లో ఉన్న అమ్మవారి ఆలయంలో తనిఖీలు చేశారు. ప్రజాభవన్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.

Read Also: Ujjain Temple: మహా శివుడి భస్మహారతిలో హీరోయిన్స్..

ప్రజాభవన్లో బాంబు ఉన్నట్లు ఫోన్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు అన్వేషణ మొదలుపెట్టారు. సెల్ ఫోన్ సిగ్నలింగ్ ఆధారంగా కనిపెట్టే పనిలో పోలీసులు రంగంలోకి దిగినట్టు తెలుస్తున్నది. ఫోన్ చేసిన వ్యక్తి ఆకతాయి లేక కావాలని ఉద్దేశపూర్వకంగానే ఫోన్ చేశాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజాభవన్ లో బాంబు ఉందని ఫోన్ రావడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ విషయం ప్రచారం మాధ్యమాల్లో రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేగింది.

Exit mobile version