NTV Telugu Site icon

Bomb Threat: ఆర్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐలకు బాంబు బెదిరింపు.. కేంద్ర ఆర్థిక మంత్రి రాజీనామాకు డిమాండ్

Bomb Threat

Bomb Threat

Bomb Threat: ఆర్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌ల కార్యాలయాలపై దాడులు చేస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి సోమవారం బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చిందని ముంబై పోలీసులు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ రాజీనామా చేయాలని బెదిరింపు మెయిల్‌ పంపిన వ్యక్తి డిమాండ్‌ చేశారు.

Read Also: PM Modi: పాపులారిటీలో ప్రపంచంలోనే అగ్రస్థానం.. అరుదైన రికార్డును సృష్టించిన ప్రధాని మోడీ..

మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటలకు ముంబైలోని 11 చోట్ల మొత్తం 11 బాంబు దాడులు జరుగుతాయని మెయిల్ ద్వారా బెదిరింపు వచ్చింది. మెయిల్‌లో పేర్కొన్న అన్ని ప్రాంతాలకు వెళ్లి విచారించినా ఏమీ కనిపించలేదని ముంబై పోలీసులు తెలిపారు. బెదిరింపును జారీ చేసిన ఇమెయిల్ ID khilafat.india@gmail.com. ముంబయిలోని ఎంఆర్‌ఏ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో బెదిరింపుపై విచారణ కోసం కేసు నమోదైంది.