Bomb At CM House: చండీగఢ్‌లోని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నివాసం సమీపంలో అధికారులు భారీ బాంబును గుర్తించారు. సీఎం నివాసం, హెలీప్యాడ్‌కు సమీపంలోని మామిడి తోటలో సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ట్యూబ్‌వెల్ ఆపరేటర్ బాంబును గమనించి అధికారులకు సమాచారం అందించారు. బాంబు షెల్ లభ్యమైన ప్రదేశం కూడా పంజాబ్, హర్యానా సీఎం హౌస్‌లోని హెలీప్యాడ్‌కు కొద్ది దూరంలోనే ఉంది. ఘటనా స్థలంలో బాంబు నిర్వీర్య దళం ఉండడంతో.. పోలీసులు ఆ ప్రాంతాన్ని సీల్ చేశారు.
Read Also: Crime News : ప్రేమను నిరాకరించిందని అమ్మాయిని కత్తితో పొడిచిన పవన్ కల్యాణ్
చండీఘడ్‌లోని కన్సల్ టీ పాయింట్, మోహాలి నయా గావ్ బోర్డర్ మధ్య మామిడి తోటలో బాంబును గుర్తించారు. పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్వ్కాడ్ సాయంతో బాంబును నిర్వీర్యం చేశామని, ఆ ప్రాంతాన్ని సైనిక బృందం స్వాధీనం చేసుకుందని డిజాస్టార్ మేనేజ్‌మెంట్, చండీఘఢ్ నోడల్ అధికారి సంజీవ్ కోహ్లి చెప్పారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశామని తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నివాసంలో లేరని అధికారులు తెలిపారు. ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. హర్యానా మాజీ సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ నివాసం కూడా ఇక్కడకు కూతవేటు దూరంలో ఉంది.
Read Also: Villagers Attack : బీభత్సంగా కొట్టుకున్న రెండు వర్గాలు.. ఆపుదామకున్న పోలీసులకు గాయాలు