NTV Telugu Site icon

Pakistan Blast: పాకిస్తాన్‎లో బాంబు పేలుడు.. 40 మంది మృతి, 200 మందికి పైగా గాయాలు

Bomb Blast

Bomb Blast

Pakistan Blast: పాకిస్థాన్‌లో ఉగ్రవాద ఘటనలు తగ్గుముఖం పట్టడం లేదు. తాజాగా ఆదివారం (జూలై 30) భారీ పేలుడు సంభవించింది. పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రాంతంలోని బజౌర్‌ లో జరిగిన ఈ బాంబు పేలుడులో 40 మంది మరణించారు, 200మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. జమియాత్ ఉలేమా-ఎ-ఇస్లాం-ఫజల్ (JUI-F) కార్మికుల సదస్సును లక్ష్యంగా చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. JUI-F సమావేశం లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ పేలుడుకు పాల్పడ్డారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని సంఘటనా స్థలం నుండి ఆసుపత్రికి తరలిస్తున్నారు.

Read Also:7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పెరగనున్న డీఏ

Read Also:Ram Charan: ఇండస్ట్రీకి మీరే నిజమైన గేమ్ ఛేంజర్.. చరణ్ ట్వీట్ వైరల్

పేలుడు తర్వాత వీడియోలు, చిత్రాలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. అందులో బాంబు పేలుడు చూడవచ్చు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. సీనియర్ JUIF నాయకుడు హఫీజ్ హమ్దుల్లా పాకిస్తానీ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ గాయపడిన వారికి అత్యవసర వైద్య చర్యలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత మంగళవారం, ఖైబర్ పఖ్తున్ఖ్వాలో నిర్మాణంలో ఉన్న మసీదుపై ఆత్మాహుతి దాడి జరిగింది, ఇందులో ఒక పోలీసు అధికారి మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాక్‌లో ఉగ్రవాద ఘటనలు పెరిగిపోవడం గమనార్హం. ది డాన్ నివేదిక ప్రకారం, గత సంవత్సరం జూన్ 18, 2022 నుండి జూన్ 18, 2023 వరకు ఖైబర్ పఖ్తుంక్వాలో 15 ఆత్మాహుతి బాంబులతో సహా 665 తీవ్రవాద దాడులు జరిగాయి.

Show comments