Site icon NTV Telugu

Bomb Blast: మ్యాచ్ జరుగుతుండగా బాంబు బ్లాస్ట్.. ఒకరు మృతి!

Bomb Blast

Bomb Blast

Bomb Blast: పాకిస్థాన్ దేశంలో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని బజౌర్ జిల్లా ఖార్ తహసీల్‌లోని కౌసర్ క్రికెట్ మైదానంలో ఒక భారీ బాంబు పేలుడు సంభవించింది. క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించి, ఆ ప్రదేశంలో అతి దట్టమైన పొగలు వ్యాపించాయి. పేలుడు తీవ్రం కారణంగా ఒక వ్యక్తి మృతి చెందినట్టు సమాచారం. అలాగే పేలుడు దాటికి పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదకర పేలుడు ఘట్టం అనంతరం క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లు, మైదానంలో ఉన్న వీక్షకులు భయంతో పరుగులు తీశారు. ఆ సమయంలో స్వల్ప తొక్కిసలాటలు కూడా జరిగాయి. పేలుడు ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా విపరీతంగా వైరల్ అవుతోంది.

Crime News: తాగడానికి డబ్బులు ఇవ్వలేదని.. తల్లిపై విచక్షణ రహితంగా?

ఇక ఈ ఘటనకు సంబంధించి.. బజౌర్ జిల్లా పోలీసు అధికారి వకాస్ రఫీక్ ప్రకారం.. ఈ దాడికి ఉపయోగించిన పరికరం ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరంగా నిర్ధారించబడిందని తెలిపారు. ఈ దాడిలో ఒకరు మరణించగా, చిన్నారులు సహా అనేక మంది గాయపడి స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆయన అన్నారు. అలాగే భద్రతా అధికారులు చెప్పిన వివరాల ప్రకారం, కొన్ని వారాల క్రితం ఓ పోలీస్ స్టేషన్‌పై క్వాడ్‌కాప్టర్ సహాయంతో ఉగ్రవాదులు దాడి చేసిన సంఘటనలో.. ఒక పోలీస్ కానిస్టేబుల్, ఒక పౌరుడు గాయపడ్డారని తెలిపారు. ప్రస్తుతం ఈ దాడిని ఉగ్రవాద వ్యతిరేక చర్యల భాగంగా ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సర్బకాఫ్’కు ప్రతిస్పందనగా ఉగ్రవాదులు నిర్వర్తించారనే అనుమానం వ్యక్తం అవుతోంది.

Little Hearts : ఓవర్సీస్ లో పవర్ స్టార్ సినిమా కలెక్షన్స్ ని దాటేసిన లిటిల్ హార్ట్స్

Exit mobile version