NTV Telugu Site icon

Urvashi Rautela : బాలయ్యను పొగడ్తలతో ముంచేసిన బాలీవుడ్ బ్యూటీ

New Project (31)

New Project (31)

Urvashi Rautela : ఈ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా చాలా క్రేజ్ సంపాదిస్తున్నారు.. అలాంటి వారిలో ఊర్వశి రౌతేలా ఒకరు. ఈ క్యూటీ బాలీవుడ్‌లో తన అందాలతో మైమరిపించింది. ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్ లో ఆమెకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ వచ్చింది. 15 ఏళ్ల వయసులో మోడలింగ్ ప్రారంభించిన ఆమె 2009లో మిస్ టీన్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత 2013లో షాప్ ది గ్రేట్ సినిమా ద్వారా సింగ్ తొలిసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

Read Also:Muppavarapu Venkaiah Naidu: మాతృ భాషను మర్చిపోయిన వాడు మనిషి కాదు.. నేను తెలుగులోనే మాట్లాడతా..

తన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఊర్వశి రౌతేల తెలుగులో చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి హిట్ కొట్టింది. ఆ తర్వాత అఖిల్ నటించిన ఏజెంట్.. తర్వాత పవన్ కళ్యాన్ , సాయి తేజ్ బ్రో సినిమాలో కూడా నటించింది. స్కందలో కూడా స్పెషల్ సాంగ్ చేసి అదరగొట్టింది. ఈ క్యూటీ ప్రస్తుతం బాలయ్య 109వ సినిమాలో నటిస్తోంది. బాలయ్య గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Read Also:Pawan Kalyan : కీరవాణికి ధన్యవాదాలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ఎందుకంటే..?

ఎంతో మంది నటీనటులతో నటించాను చాలా మంది పెద్ద యాక్టర్లతో కూడా నటించాను. కానీ బాలయ్య లాంటి పెద్ద యాక్టర్.. లెజెండరీ యాక్టర్, తన పని పట్ల చాలా శ్రద్ధగా వ్యవహరిస్తుంటారు. ఆయన ఇతరులను విధానం కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా మహిళలను కూడా గౌరవిస్తుంటారు. అందుకే ఆయన అంటే నాకు చాలా అభిమానం అని ఆయనతో కలిసి చేసేటప్పుడు తాను ఎప్పుడూ ఇబ్బంది పడలేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఊర్వశి రౌతేలా చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా అవుతుండడంతో బాలయ్య అభిమానులు ఈ విషయం పైన స్పందిస్తూ.. మా బాలయ్య ఎవరికైనా నచ్చేస్తారు.. ఆయనతో బాండింగ్ అలాంటిది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Show comments