Site icon NTV Telugu

Boinapally Vinod Kumar: జమిలి ఎన్నికలు మంచిదే కానీ… చర్చ జరగాలని లా కమిషన్‌కు చెప్పాం

Vinod Kumar

Vinod Kumar

జమిలి ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ సీనియర్ నేత వినోద్ కుమార్ మాట్లాడుతూ.. 2018లో జమిలి ఎన్నికల పై మా అభిప్రాయం చెప్పామని, జమిలీ ఎన్నికలు మంచిదే కానీ…చర్చ జరగాలని లా కమిషన్ కు చెప్పామన్నారు. మోడీ సర్కార్ పదేళ్లుగా మాట్లాడకుండా ఇప్పుడు హడావుడిగా పార్లమెంట్ సమావేశాలు పిలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సమావేశాలు పెట్టీ మోడీ దేశాన్ని గందరగోళ పరిస్థితులోకి నెట్టాడని ఆయన మండిపడ్డారు. మోడీకి తప్ప… బీజేపీలో ఉన్న వారికి కూడా ఏమి జరుగుతుందో తెలియడం లేదని వినోద్‌ కుమార్‌ అన్నారు. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతితో కమిటీ వేయడం ఆశ్చర్యకరమని ఆయన అన్నారు. కమిటిలో అంతా ఉత్తర భారతదేశ సభ్యులు మాత్రమే ఉన్నారని, దక్షిణ భారత దేశం నుంచి ఒక్కరూ కూడా లేరని ఆయన విమర్శలు గుప్పించారు.

Also Read : Andrapradesh : ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో ఐదుగురు మృతి..

అంతేకాకుండా.. ‘జమిలి ఎన్నికలపై ఇప్పటికే రిపోర్ట్ రెడీ అయ్యి ఉందా ? ఇప్పుడు వేసిన కమిటీ నామకే వస్తె కమిటా అన్న అనుమానం ఉంది. మోడీ దేశం ను ఎటువైపు తీసుకెళ్తున్నారు అర్థం కావడం లేదు. ఏపీ విభజన చట్టంలో రెండు రాష్ట్రాల అసెంబ్లీ లలో సభ్యుల సంఖ్య పెంచాలని ఉంది…కానీ అది ఇప్పటి వరకు అతి గతి లేదు. మహిళ రిజర్వేషన్ల బిల్లు పై పదేళ్లు ఏమి చేసింది మోడీ సర్కార్ ?. ఎన్నికల కోసం గందరగోల పరిస్థితి బిజెపి ప్రభుత్వం దేశంలో సృష్టిస్తుంది. మ…మా అనిపీయడానికి ఇప్పుడు రామ్ నాథ్ కోవింద్ తో కమిటీ వేసినట్టు అనిపిస్తుంది. జమిలి ఎన్నికల అంశం …తాజా పరిణామాల పై BRS లో చర్చిస్తాం.’ అని ఆయన అన్నారు.

Also Read : Rayachoti Student Died In Ukraine: ఎంబీబీఎస్ చేసేందుకు వెళ్లి గుండెపోటుతో మరణించిన విద్యార్థి

Exit mobile version