Site icon NTV Telugu

Bodies Found: నదిలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు లభ్యం

Bodies Found

Bodies Found

Bodies Found in Riverbed: మహారాష్ట్రలోని పుణె జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పుణె జిల్లాలో నదీగర్భంలో ముగ్గురు పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. మృతుల్లో వృద్ధ దంపతులు, వారి కూతురు, అల్లుడు, ముగ్గురు మనుమలు ఉన్నారని ఓ పోలీసు అధికారి తెలిపారు. పుణె నగరానికి 45 కిలోమీటర్ల దూరంలోని దౌండ్ తహసీల్‌లోని యావత్ గ్రామ శివార్లలో భీమా నదిపై పర్గావ్ వంతెన సమీపంలో సోమవారం నాలుగు, మంగళవారం మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి.

Naveen Jindal: నవీన్ జిందాల్‌కు ఖైదీ బెదిరింపు లేఖ.. రూ. 50 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తానంటూ..

మృతులు ఏడుగురూ ఒకే కుటుంబానికి చెందినవారు, అందులో దంపతులు, వారి కుమార్తె, అల్లుడు, వారి ముగ్గురు పిల్లలు ఉన్నారు. భీమా నదిలో ఒకదానికొకటి 200 నుంచి 300 మీటర్ల దూరంలో మృతదేహాలు కనుగొనబడ్డాయని పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను వెలికి తీశామని, మృతికి గల కారణాలు, పరిస్థితులపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఆత్మహత్యాయత్నం సహా అన్ని కోణాల్లో పోలీసులు కేసును విచారిస్తున్నారని తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version